
జిల్లాలో మార్చికి నీటిమట్టం వివరాలు
మండలం మీటర్లు
గుర్రంకొండ 27.03
ఓబులవారిపల్లె 26.01
వీరబల్లి 25.16
చిట్వేలి 24.57
రామాపురం 22.91
రాజంపేట 21.70
పీలేరు 20.39
నిమ్మనపల్లె 20.02
మొలకలచెరువు 19.26
కేవిపల్లె 18.25
మదనపల్లె 18.20
కోడూరు 17.61
టి.సుండుపల్లె 17.40
తంబళ్లపల్లె 15.97
చిన్నమండెం 15.85
రాయచోటి 15.63
వాయల్పాడు 15.24
పుల్లంపేట 14.86
కలకడ 9.65
పెనగలూరు 9.38
పీటీసముద్రం 7.05
బి.కొత్తకోట : గత ఖరీఫ్‌లో 19 మండలాల్లో కరువు పరిస్థితులు నెలకొని రైతాంగాన్ని తీవ్ర కష్టనష్టాలకు గురిచేసిన వర్షాభావ పరిస్థితులు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. దీని ప్రభావం జిల్లాలో తాగునీటిపై చూపుతోంది. వర్షాలు లేకపోవడంతో జిల్లాలో భూగర్భజలాల నీటి మట్టం లోతుకు పడిపోతోంది. అత్యంత ప్రమాదకర స్థితిలో గుర్రంకొండ మండలం ఉండగా మరో 23 మండలాల్లో నీటి మట్టాలు అధికంగా పడిపోయాయి. ఇదే పరిస్థితి కొనసాగితే ఈనెలఖారులోగా నీటి మట్టాలు ఇంకా ఎన్ని మీటర్లలోతుకు పడిపోతాయో చెప్పలేని పరిస్థితి నెలకొంది. మరోవైపు తాగునీటి కష్టాలు ఏడు మండలాల్లో నెలకొనగా.. ఇప్పుడా అప్పుడా అన్నట్టు మరో 260 పల్లెల్లో నీటి కష్టాలు కాచుకుని ఉన్నాయి. దీనితో వేసవి ప్రణాళిక అమలు చేయాలని గ్రామీణ నీటి సరఫరా విభాగం ప్రభుత్వానికి నిధుల కోసం ప్రతిపాదనలు పంపింది.
ఇదీ భూగర్భ జల మట్టం
జిల్లాలో 30 మండలాలు ఉండగా అందులో ఆరు మండలాల్లో 20 మీటర్ల నుంచి 27 మీటర్ల లోతుకు నీటి మట్టం పడిపోయింది. రెండు మండలాలు 20 మీటర్లలోతులో, 10 మండలాల్లో 14 నుంచి 20 మీటర్లలోపు లోతుకు తగ్గిపోయింది. మరో మూడు మండలాల్లో సాధారణ స్థితిలో ఉంది. మిగిలిన తొమ్మిది మండలాల్లో భూగర్భ జలమట్టం పరిస్థితి తారుమారైంది. జనవరి, ఫిబ్రవరి మాసాల్లో లెక్కించిన భూగర్భ జలమట్టం లెక్కింపులో పడిపోయిన నీటిమట్టం మార్చిలో అమాంతం పైకి ఎగబాకడం విశేషంగా చెప్పుకోవాలి.
సేద్యానికి కష్టం
జిల్లాలో భూగర్భ జలమట్టం పడిపోవడం రైతులను తీవ్ర నష్టాలకు గురిచేస్తోంది. వ్యవసాయబోర్లపై ఆధారపడి పంటలను సాగు చేస్తున్నారు. ప్రతి మండలంలోనూ ఆ ప్రాంతంలో సాగయ్యే పంటల రకాలపై ఆధారపడి రైతులు జీవనం సాగిస్తున్నారు. ఇటివల పంటలకు వినియోగిస్తున్న సాగునీటి బోర్లనుంచి నీరు అడుగండిపోతుండటంతో పంటలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. పంటలను ఎండబెట్టుకోలేక కొత్తగా బోర్లు వేస్తూ తీవ్రంగా నష్టపోతున్నారు. వెయ్యి అడుగులలోతులోనూ నీటి జాడలు కనిపించడం లేదు.
ఇప్పుడు 79, ఇంకో 260 పల్లెలు
జిల్లాలో వేసవి ఒకవైపు, పడిపోతున్న భూగర్బ జలాలతో ప్రజలు తాగునీటికి కటకటలాడే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం జిల్లాలోని చిన్నమండెం మండలంలో ఒకటి, రాయచోటిలో 20, సంబేపల్లెలో 5, లక్కిరెడ్డిపల్లెలో 28, రామాపురంలో 10, గాలివీడులో 13, ములకలచెరువు మండలంలో రెండు పల్లెలో నీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వీరికి ప్రతిరోజూ ట్యాంకర్లతో 165 ట్రిప్పులు నీటిని సరఫరా చేస్తున్నారు. ఇప్పటికి ఈ పరిస్థితికాగా వచ్చే రోజుల్లో నీటి సమస్య తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని అధికారులు గుర్తించారు. జిల్లా వ్యాప్తంగా మరో 260 పల్లెల్లో నీటి సమస్య తలెత్తే ప్రమాదాన్ని నిర్దారించి దీనిపై వేసవి ప్రణాళిక ద్వారా తాగునీటిని ప్రజలకు అందించడం కోసం రూ.7.95 కోట్లతో ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపారు. వివిధ మార్గాల్లో నీటిని అందించడం కోసం ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఈ నిధులు అవసరమని నివేదించారు.
తగ్గి, పెరిగిన నీటిమట్టం (మీటర్లు)
మండలం ఫిబ్రవరి మార్చి
పెద్దమండ్యం 23.96 11.12
కురబలకోట 11.41 10.78
ఎల్‌ఆర్‌పల్లె 31,40 10.27
బి.కొత్తకోట 11.51 8.41
రామసముద్రం 8.85 6.70
గాలివీడు 12.80 6.66
సంబేపల్లె 11.39 6.45
కలికిరి 7.30 6.38
నందలూర్ 8.67 5.73
జిల్లాలో 21 మండలాల్లో
పడిపోయిన భూగర్భ జలమట్టం
గుర్రంకొండలో అత్యధికంగా 27 మీటర్లకు..
మరో 260 పల్లెల్లో
తరుముతున్న నీటి సమస్య
తాగునీటి కోసం రూ.7.95 కోట్లతో వేసవి ప్రణాళిక
ఇదీ వేసవి ప్రణాళిక
ప్రతిపాదన : రూ.7.95 కోట్లు
టైఅప్‌కు : రూ.21.90 లక్షలు
ట్యాంకర్లతో సరఫరా : రూ.7.69 కోట్లు
బోర్లలోతు, రిపేర్లు : రూ.4.07 లక్షలు
8 మీటర్లలే లెక్క
జిల్లాలో భూగర్భజల మట్టాలు పడిపోతున్నాయి. ప్రభుత్వం నిర్దేశించిన మేరకు భూగర్బ జలమట్టం 8 మీటర్లు దాటితే ప్రమాదకర సంకేతమని చెప్పింది. దీనికి అనుగుణంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. 8 మీటర్లు, దానికంటే పైన నీటిమట్టం ఉంటే ఆ మండలాల్లో ఎలాంటి నీటి సమస్యలు తలెత్తవు. ఈ ప్రామాణికంగా చూస్తే జిల్లాలో అత్యధిక మండలాల్లో భూగర్భజలమట్టం పడిపోతోంది. జనవరి, ఫిబ్రవరిలో భారీగా పడిపోవడం, మళ్లీ పెరగడం జరిగినా మార్చిలో మాత్రం భారీగా తగ్గింది. – హమీదాబాను, అసిస్టెంట్ హైడ్రో జియాలజిస్టు

జిల్లాలో మార్చికి నీటిమట్టం వివరాలు

జిల్లాలో మార్చికి నీటిమట్టం వివరాలు