వందేళ్ల క్రితం కనుమరుగైన గ్రామం.. రికార్డుల్లో మాత్రం సజీవం | Prakasam District Pullari Palem Village Remains In Records Only | Sakshi
Sakshi News home page

వందేళ్ల క్రితం కనుమరుగైన గ్రామం.. రికార్డుల్లో మాత్రం సజీవం

Published Tue, Oct 12 2021 11:46 AM | Last Updated on Tue, Oct 12 2021 4:57 PM

 Prakasam District Pullari Palem Village Remains In Records Only - Sakshi

వేటపాలెం: సూమారు వందేళ్ల కిందట వేటపాలెం మండలం పరిధిలోని పందిళ్లపల్లి గ్రామానికి తూర్పుగా కొత్తరెడ్డిపాలెం గ్రామానికి దగ్గరలో పుల్లరిపాలెం గ్రామ ఉండేది. అది పూర్తిగా అటవీ ప్రాతంగా ఉండేదని పూర్వికులు చెబుతుంటారు. చాలా ఏళ్ల కిందట ఈ గ్రామంలో ప్లేగు, కలరాలాంటి అంటువ్యాదులు ప్రబలి పెద్ధ సంఖ్యలో గ్రామస్తలు మృత్యువాత పడ్డారు. దీనితో గ్రామంలో మిగిలిన వారు ఇళ్లు వాకిలి వదిలి వలసబాట పట్టారని ఆ ప్రాంతంలోని వృద్ధులు చెబుతుంటారు. ఇలా గ్రామం కనుమరుగైందన్న మాట. ఆ గ్రామానికి చెందిన ఎటువంటి ఆనవాళ్ల ఇప్పడు లేవు. పుల్లరిపాలెం గ్రామం భౌతికంగా కనుమరుగైనా పంచాయతీకి సంబందించిన పరిపాలన గ్రామానికి దగ్గరలోని కొత్తరెడ్డిపాలెంలో ప్రస్తుతం కొనసాగుతుంది.

సాధారణంగా ఏ గ్రామ పరిపాలనైనా ఆ గ్రామం పేరు మీదుగానే జరుగుతుంది. గ్రామంలోని ప్రజలు కూడా తాము పలానా ఊరి వారమంటూ రెవెన్యూ సౌకర్యాలు, ఇతరత్రా సదుపాయాలు పొందుతారు. కానీ వేటపాలెం మండంలోని పుల్లరిపాలెం గ్రామం మాత్రం ఇందుకు విబిన్నం. ఎందుకంటే ఎప్పుడో ఒకానోక సమయంలో ఈ ఊరు ఉండేది. ప్రస్తుతం పేరొక్కటే ఉంది. ఈ పేరుమీదనే మండలంలోని ఆ పంచాయతీ కింది ఉన్న కొత్తరెడ్డిపాలెం, పాతరెడ్డిపాలెం, రామాచంద్రాపురం, బచ్చులవారిపాలెం, ఊటుకూరిసుబ్బయ్యపాలెం, సాయనగర్‌ గ్రామాలకు చెందిన వారు ప్రస్తుతం సదుపాయాలు పొందుతున్నారు. 

మండలంలో పుల్లరిపాలెం పంచాయతీ తెలియనివారు ఈ ప్రాంతంలో ఉండరు. గ్రామానికి సర్పంచ్, కార్యదర్శి, వీఆర్‌ఓ, ఎంపీటీసీ సభ్యుడు ఉన్నారు. కానీ భౌతికంగా ఆ గ్రామమే లేదు. ఈ పల్లె గురించి ఇప్పటికీ చాలా మందికి తెలియదు. కొత్తగా ఈ ప్రాంతానికి వచ్చే అధికారులు సైతం పుల్లరిపాలెం గ్రామం ఎక్కడుందబ్బా అంటూ ఆశ్చర్యానికి గురికావాల్సిందే. ఈ గ్రామ పంచాయతీ కింద ఆరు లామినెటెబ్‌ గ్రామాలు లబ్దిపొందుతుంటాయి. ఈ ఆరు గ్రామాలకు పుల్లరిపాలెం గ్రామ పంచాయతీ పేరుమీదనే ప్రభుత్వ రికార్డుల్లో పరిపాలన జరుగుతుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement