గ్రహం అనుగ్రహం: శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు పుష్య మాసం, తిథి: శు.షష్ఠి రా.9.04 వరకు తదుపరి సప్తమి,నక్షత్రం: పూర్వాభాద్ర రా.9.54 వరకు, తదుపరి ఉత్తరాభాద్ర, వర్జ్యం: లేదు, దుర్ముహూర్తం: సా.4.06 నుండి 4.52 వరకు, అమృతఘడియలు: ప.2.01 నుండి 3.44 వరకు.
సూర్యోదయం : 6.36
సూర్యాస్తమయం : 5.35
రాహుకాలం : సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం : ప.12.00 నుంచి 1.30 వరకు
మేషం...కొన్ని కార్యక్రమాలు సజావుగా పూర్తి చేస్తారు.. రాబడి పెరుగుతుంది. వాహనయోగం. కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగప్రాప్తి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
వృషభం...దూరపు బంధువుల కలయిక. ముఖ్య నిర్ణయాలు. పనులు వేగంగా సాగుతాయి. పాతమిత్రుల నుంచి ఆహ్వానాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు హోదాలు.
మిథునం....వ్యయప్రయాసలు. ఆదాయానికి మించి ఖర్చులు. దూరప్రయాణాలు. పనుల్లో జాప్యం. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.
కర్కాటకం....మిత్రులు, బంధువులతో అకారణంగా తగాదాలు. ఆలోచనలు కలిసిరావు. కుటుంబంలో చికాకులు. ఆలయ దర్శనాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.
సింహం....శ్రమ ఫలిస్తుంది. నూతన వ్యక్తుల పరిచయం. ఆలోచనలు అమలు చేస్తారు. ఆకస్మిక ధనలాభం. వ్యాపారాలు పురోగతిలో సాగుతాయి. ఉద్యోగులకు కీలక సమాచారం..
కన్య.....నిరుద్యోగులకు అనుకూల సమాచారం. సమస్యలు కొన్ని పరిష్కారం. వస్తులాభాలు. పనులలో విజయం. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు పురోగతి.
తుల....అనుకున్న కార్యాలలో అవాంతరాలు. దూరప్రయాణాలు. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలలో ఒడిదుడుకులు. వ్యాపార, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.
వృశ్చికం....శ్రమ పడ్డా ఫలితం ఉండదు. కొన్ని పనులు వాయిదా పడతాయి. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.
ధనుస్సు...కుటుంబసౌఖ్యం. నూతన ఉద్యోగప్రాప్తి.. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.
మకరం....కొన్ని కార్యక్రమాలలో ఆటంకాలు. దుబారా వ్యయం. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.
కుంభం... బాకీలు వసూలవుతాయి. ఇంటర్వ్యూలు అందుతాయి. ఆలయాల సందర్శనం. ముఖ్య నిర్ణయాలు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.
మీనం..పనులు వాయిదా పడతాయి. శ్రమాధిక్యం. అనారోగ్యం. కుటుంబ సమస్యలు. ప్రయాణాలలో మార్పులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.
Comments
Please login to add a commentAdd a comment