గ్రహం అనుగ్రహం: శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిరమాసం, తిథి: శు.పంచమి ఉ.10.51 వరకు, తదుపరి షష్ఠి, నక్షత్రం: శ్రవణం సా.4.46 వరకు, తదుపరి ధనిష్ఠ, వర్జ్యం: రా.8.38 నుండి 10.10 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.33 నుండి 9.21 వరకు తదుపరి ప.12.15 నుండి 1.03 వరకు, అమృతఘడియలు: ఉ.6.28 నుండి 8.01 వరకు; రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు, యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు, సూర్యోదయం: 6.20, సూర్యాస్తమయం: 5.21.
మేషం: శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. భూలాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.
వృషభం: పనుల్లో జాప్యం. రుణాలు చేస్తారు. మిత్రులతో కలహాలు. దూరప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపారాలలో మార్పులు. ఉద్యోగులకు పనిభారం.
మిథునం: ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. శ్రమాధిక్యం. దూరప్రయాణాలు. కుటుంబ, ఆరోగ్య సమస్యలు. మిత్రులతో విభేదాలు. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహం.
కర్కాటకం: యత్నకార్యసిద్ధి. ప్రముఖుల నుంచి కీలక సమాచారం. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
సింహం: ఉద్యోగయత్నాలు సానుకూలం. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. సంఘంలో గౌరవం. వస్తు, వస్త్రలాభాలు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి.
కన్య: పనులు మధ్యలో విరమిస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువర్గంతో విభేదాలు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు.
తుల: కుటుంబసభ్యులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆస్తి వివాదాలు. పనుల్లో ఆటంకాలు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.
వృశ్చికం: శ్రమ ఫలిస్తుంది. నూతన విషయాలు లె లుసుకుంటారు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. పరిచయాలు విస్తృతవుతాయి. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.
ధనుస్సు: ముఖ్యమైన కార్యక్రమాలలో అవరోధాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా సమస్యలు. అనారోగ్యం. వృత్తి,వ్యాపారాలలో ఒడిదుడుకులు.
మకరం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖుల నుంచి కీలక సందేశం. వస్తులాభాలు. పాతమిత్రుల కలయిక. వ్యాపార, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.
కుంభం: ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో తగాదాలు. ఆస్తి వివాదాలు. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలలో గందరగోళం.
మీనం: కుటుంబంలో ఉత్సాహవంతంగా ఉంటుంది. ఆసక్తికర సమాచారం. విందువినోదాలు. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. వృత్తి, వ్యాపారాలలో పురోభివృద్ధి.
Comments
Please login to add a commentAdd a comment