శ్రీ∙క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, తిథి: సప్తమి సా.5.54 వరకు, తదుపరి అష్టమి, నక్షత్రం: అనూరాధ సా.4.30 వరకు, తదుపరి జ్యేష్ఠ, వర్జ్యం: రా.10.15 నుండి 11.55 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.16 నుండి 9.04 వరకు, తదుపరి రా.10.51 నుండి 11.39 వరకు, అమృతఘడియలు: లేవు; రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు, యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు, సూర్యోదయం: 5.50, సూర్యాస్తమయం: 6.05.
మేషం: పనుల్లో స్వల్ప ఆటంకాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా కొంత ఒత్తిడులు. ఆరోగ్యభంగం. బంధుమిత్రులతో మాటపట్టింపులు. వ్యాపార, ఉద్యోగాలు నిరాశపరుస్తాయి.
వృషభం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు అందుతాయి. ఆస్తి వివాదాల పరిష్కారం. వాహనయోగం. పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో లక్ష్యాలు నెరవేరతాయి.
మిథునం: ఇంటాబయటా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. వాహనయోగం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో నూతనోత్సాహం.
కర్కాటకం: దూరప్రయాణాలు. కుటుంబంలో చికాకులు. అనారోగ్య సూచనలు. పనులు మందకొడిగా సాగుతాయి. నిర్ణయాలలో కొన్ని మార్పులు. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.
సింహం: ముఖ్యమైన కార్యక్రమాలలో అవాంతరాలు. రుణాలు చేస్తారు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలలో కొన్ని చిక్కులు. ఉద్యోగాలలో మరింత పనిభారం. ఆరోగ్యభంగం..
కన్య: పనుల్లో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు కొంతమేర వసూలవుతాయి. విద్యార్థులు సత్తా చాటుకుని ముందుకు సాగుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా కొనసాగుతాయి.
తుల: ఆకస్మిక ప్రయాణాలు. కొత్తగా రుణాలు చేస్తారు. ఆలయ దర్శనాలు. ముఖ్యమైన పనులు కొన్ని నిదానంగా సాగుతాయి. వ్యాపారాలలో నిరుత్సాహం. ఉద్యోగులకు శ్రమ పెరుగుతుంది. ఉద్యోగయత్నాలు మందగిస్తాయి.
వృశ్చికం: ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. మిత్రుల నుంచి ఆహ్వానాలు రాగలవు. గృహ, వాహనయోగాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. అవార్డులు దక్కుతాయి.
ధనుస్సు: కుటుంబసభ్యులతో విభేదాలు నెలకొనవచ్చు. అనారోగ్యం. అనుకోని ప్రయాణాలు. వ్యవహారాలలో ఆటంకాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళంగా ఉంటుంది.
మకరం: చిన్ననాటి మిత్రులతో చర్చలు. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆశ్చర్యకరమైన సంఘటనలు. వస్తులాభాలు. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూలత. విందువినోదాలు.
కుంభం: కుటుంబంలో సందడిగా ఉంటుంది. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి ధన,వస్తులాభాలు. దైవదర్శనాలు. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు శుభవార్తలు.
మీనం: కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పనులు వాయిదా వేస్తారు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు ఇబ్బంది కలిగిస్తాయి. ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు.
Comments
Please login to add a commentAdd a comment