శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, తిథి: శు.ఏకాదశి రా.11.44 వరకు, తదుపరి ద్వాదశి, నక్షత్రం: రేవతి ఉ.10.04 వరకు, తదుపరి ఆశ్విని, వర్జ్యం: తె.4.38 నుండి 6.07 వరకు (తెల్లవారితే గురువారం), దుర్ముహూర్తం: ప.11.30 నుండి 12.14 వరకు, అమృతఘడియలు: ఉ.7.48 నుండి 9.18 వరకు తదుపరి రా.1.40 నుండి 3.09 వరకు, గీతా జయంతి; రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు, యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు, సూర్యోదయం: 6.24, సూర్యాస్తమయం: 5.23.
మేషం...పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.
వృషభం....ఊహించని ఉద్యోగాలు. ఆర్థిక ప్రగతి. కొత్త విషయాలు తెలుస్తాయి. సంఘంలో గౌరవం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు హోదాలు.
మిథునం.....కొత్త ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. పనులు సకాలంలో పూర్తి. ధనలాభం. వృత్తి, వ్యాపారాలలో అనుకూలత.
కర్కాటకం...రాబడికి మించి ఖర్చులు. అదనపు బాధ్యతలు. కుటుంబసభ్యులతో తగాదాలు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు ఒత్తిడులు.
సింహం....వ్యయప్రయాసలు. కుటుంబసభ్యులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. పనులు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.
కన్య....రుణాలు తీరతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. భూవివాదాల పరిష్కారం. వృత్తి, వ్యాపారాలలో నూతనోత్సాహం.
తుల....బంధువుల సలహాలు స్వీకరిస్తారు. సంఘంలో గౌరవం. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు వేస్తారు.
వృశ్చికం...మిత్రులతో మాటపట్టింపులు. అనుకోని ఖర్చులు. బంధువుల కలయిక. శ్రమ తప్పదు. పనుల్లో అవరోధాలు. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిళ్లు.
ధనుస్సు...కార్యక్రమాలలో అవాంతరాలు. ఆదాయానికి మించి ఖర్చులు. మిత్రులు, బంధువులతో తగాదాలు. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలు నిరాశ చెందుతారు.
మకరం....నూతన కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు వింటారు. దూరపు బంధువుల కలయిక. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు హోదాలు.
కుంభం...ఆరోగ్యసమస్యలు. పనుల్లో ఆటంకాలు. రాబడి అంతగా కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.
మీనం....రుణాలు తీరతాయి. ఆప్తులు దగ్గరవుతారు. వాహనయోగం. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. వ్యాపార విస్తరణ.
Comments
Please login to add a commentAdd a comment