ఈ రాశివారికి పనుల్లో విజయం.. దైవదర్శనాలు! | Today Telugu Horoscope On November 11th, 2024: Know Astrological Predictions Of Your Zodiac Signs In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశివారికి పనుల్లో విజయం.. దైవదర్శనాలు!

Published Mon, Nov 11 2024 6:43 AM | Last Updated on Mon, Nov 11 2024 8:53 AM

daily horoscope 11th november 2024 in telugu

శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, తిథి: శు.దశమి ప.2.23 వరకు, తదుపరి ఏకాదశి, నక్షత్రం: శతభిషం ఉ.6.32 వరకు, తదుపరి పూర్వాభాద్ర తె.5.08 వరకు (తెల్లవారితే మంగళవారం), వర్జ్యం: ప.12.34 నుండి 2.02 వరకు, దుర్ముహూర్తం: ప.12.09 నుండి 12.57 వరకు, తదుపరి ప.2.25 నుండి 3.13 వరకు, అమృతఘడియలు: రా.9.31 నుండి 11.01 వరకు; రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు, యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు, సూర్యోదయం: 6.05, సూర్యాస్తమయం: 5.23.

మేషం.. కాంట్రాక్టులు దక్కుతాయి. పనులు విజయవంతంగా ముగుస్తాయి. ఆహ్వానాలు రాగలవు. ఆస్తిలాభం. వృత్తి, వ్యాపారాలలో చిక్కులు తొలగుతాయి.

వృషభం... శుభకార్యాలకు హాజరవుతారు. ఆధ్యాత్మిక చింతన. విందువినోదాలు. విలువైన సమాచారం. వస్తులాభాలు. వృత్తి, వ్యాపారాలు అనుకూలిస్తాయి.

మిథునం... దూరప్రయాణాలు. కుటుంబంలో చికాకులు. ఆధ్యాత్మిక చింతన. పనులు వాయిదా పడతాయి. వృత్తి, వ్యాపారాలు నిరాశ పరుస్తాయి.

కర్కాటకం... వ్యవహారాలలో ఆటంకాలు. వృథా ఖర్చులు. దూరప్రయాణాలు. అనారోగ్య సూచనలు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

సింహం... కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వస్తులాభాలు. వృత్తి, వ్యాపారాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.

కన్య... కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు. పనుల్లో విజయం. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.

తుల... దూరప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. అనుకోని ఖర్చులు. శ్రమానంతరం పనులు పూర్తి. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.

వృశ్చికం... మిత్రులతో కలహాలు. రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా నిరాశ. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు.

ధనుస్సు.. పరిచయాలు పెరుగుతాయి. ఆత్మీయులను కలుసుకుంటారు. ఆధ్యాత్మిక చింతన. పనులు సకాలంలో పూర్తి. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహం.

మకరం.. రాబడి నిరుత్సాహపరుస్తాయి. శ్రమాధిక్యం. పనుల్లో అవరోధాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.

కుంభం.. నూతన ఉద్యోగప్రాప్తి. సంఘంలో ఆదరణ. కొత్త కార్యక్రమాలు చేపడతారు. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో కొత్త ఆశలు.

మీనం... వ్యవహారాలలో ఆటంకాలు. అనుకోని ఖర్చులు. కుటుంబ, ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిళ్లు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement