గ్రహం అనుగ్రహం: శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు పుష్య మాసం, తిథి: శు.చతుర్దశి తె.4.46 వరకు (తెల్లవారితే సోమవారం) తదుపరి పౌర్ణమి, నక్షత్రం: మృగశిర ఉ.11.33 వరకు తదుపరి ఆరుద్ర, వర్జ్యం: రా.7.47 నుండి 9.19 వరకు, దుర్ముహూర్తం: సా.4.16 నుండి 5.05 వరకు, అమృత ఘడియలు: రా.1.11 నుండి 2.44 వరకు.
సూర్యోదయం : 6.38
సూర్యాస్తమయం : 5.39
రాహుకాలం : సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం : ప.12.00 నుంచి 1.30 వరకు
మేషం...కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. అందరిలోనూ గౌరవం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో ఆధిక్యం చూపుతారు.
వృషభం...కుటుంబసభ్యులతో వివాదాలు. ధనవ్యయం. స్వల్ప అనారోగ్యం. బంధువుల నుంచి ఒత్తిళ్లు. వ్యాపారాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. ఉద్యోగాలలో గందరగోళం.
మిథునం...ముఖ్యమైన పనుల్లో విజయం. శుభవర్తమానాలు. ఆకస్మిక ధనలబ్ధి. కొత్త వ్యక్తుల పరిచయం. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో ఉన్నత హోదాలు.
కర్కాటకం.....వ్యవహారాలు మందగిస్తాయి. శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. వ్యాపారాలలో చికాకులు. ఉద్యోగాలలో మార్పులు.
సింహం.....బంధువుల కలయిక. విందువినోదాలు. కొత్త పనులు చేపడతారు. వాహన, గృహయోగాలు. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు.
కన్య....అందరిలోనూ గుర్తింపు లభిస్తుంది. మిత్రుల నుంచి కీలక సమాచారం. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వ్యాపారాలు ఉత్సాహాన్నిస్తాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు.
తుల...ఆకస్మిక ప్రయాణాలు. రుణయత్నాలు. బంధువులతో తగాదాలు.ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు.
వృశ్చికం....సన్నిహితులతో విభేదాలు. శ్రమకు ఫలితం కనిపించదు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఉద్యోగయత్నాలు నెమ్మదిస్తాయి. వ్యాపారాలు కొంత ఇబ్బందిగా ఉంటాయి. ఉద్యోగ మార్పులు.
ధనుస్సు... కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుంటారు. యత్నకార్యసిద్ధి. వాహనయోగం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.
మకరం....సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితుల నుంచి శుభవర్తమానాలు. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఉన్నతస్థితి.
కుంభం...ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. ఖర్చులు తప్పవు. దూరప్రయాణాలు. బంధువులతో విభేదాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిళ్లు.
మీనం..ఆర్థిక వ్యవహారాలు కాస్త నిరాశ కలిగిస్తాయి. కుటుంబసభ్యులతో విభేదాలు. అనారోగ్యం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగాలలో పనిభారం.
Comments
Please login to add a commentAdd a comment