శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, తిథి: శు.త్రయోదశి సా.6.16 వరకు, తదుపరి చతుర్దశి, నక్షత్రం: భరణి ఉ.6.50 వరకు, తదుపరి కృత్తిక తె.5.29 వరకు (తెల్లవారితే శనివారం), వర్జ్యం: సా.6.09 నుండి 7.38 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.35 నుండి 9.21 వరకు, తదుపరి ప.12.15 నుండి 1.01 వరకు, అమృత ఘడియలు: రా.3.11 నుండి 4.41 వరకు, హనుమద్వ్రతం; రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు, యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు, సూర్యోదయం: 6.25, సూర్యాస్తమయం: 5.24.
మేషం...వ్యవహారాలలో విజయం. శుభకార్యాలకు హాజరవుతారు. ఆప్తుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకున్న హోదాలు.
వృషభం...పనులలో జాప్యం. ఆర్థిక విషయాలు మందకొడిగా ఉంటాయి. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. అనారోగ్యం. మిత్రుల నుంచి సమస్యలు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో గందరగోళం.
మిథునం...నూతన ఉద్యోగాలు పొందుతారు. సోదరులు,సోదరీలతో సఖ్యత. విందువినోదాలు. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వాహనయోగం. వ్యాపారాలలో పురోగతి. ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.
కర్కాటకం...మిత్రుల నుంచి ముఖ్య సమాచారం. ఆస్తిలాభ సూచనలు. ప్రముఖులతో పరిచయాలు. నూతన ఒప్పందాలు. వాహనయోగం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు.
సింహం....ప్రయాణాలలో ఆటంకాలు. పనులు ముందుకు సాగవు. బంధువర్గంతో విభేదాలు. అనారోగ్య సూచనలు. శ్రమ మరింత పెరుగుతుంది. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు.
కన్య...ముఖ్యమైన పనుల్లో తొందరపాటు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు తప్పవు. బంధువులు, మిత్రులతో విభేదాలు. అనారోగ్యం. వ్యాపారాలు కొంత వరకూ లాభిస్తాయి. ఉద్యోగాలలో పనిభారం.
తుల..కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక ప్రగతి. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వాహనయోగం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో మంచి గుర్తింపు రాగలదు.
వృశ్చికం....సన్నిహితులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక చింతన. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు సామాన్యంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు.
ధనుస్సు...ఆర్థిక ఇబ్బందులు. రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఆస్తి వివాదాలు. బంధువులు, మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆలయాల సందర్శనం. వ్యాపారాలు కొంత నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో పనిభారం.
మకరం...కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. వాహనయోగం. బంధువులతో సఖ్యత. విలాసవంతంగా గడుపుతారు. నూతన ఉద్యోగప్రాప్తి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి బయటపడతారు.
కుంభం...రుణయత్నాలు. దూరప్రయాణాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో వివాదాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు మందకొడిగా ఉంటాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు.
మీనం..దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు. పనులు చకచకా పూర్తి చేస్తారు. పరిచయాలు పెరుగుతాయి. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో అనూహ్య మార్పులు.
Comments
Please login to add a commentAdd a comment