గ్రహం అనుగ్రహం: శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్య మాసం, తిథి: బ.పాడ్యమి రా.3.33 వరకు, తదుపరి విదియ, నక్షత్రం: పునర్వసు ఉ.10.54 వరకు, తదుపరి పుష్యమి, వర్జ్యం: సా.6.56 నుండి 8.34 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.51 నుండి 9.39 వరకు తదుపరి రా.10.55 నుండి 11.43 వరకు, అమృత ఘడియలు: తె.4.21 నుండి 6.18 వరకు (తెల్లవారితే బుధవారం), మకర సంక్రాంతి, ఉత్తరాయణం ప్రారంభం.; రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు, యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు, సూర్యోదయం: 6.38, సూర్యాస్తమయం: 5.40.
మేషం....రుణాలు చేస్తారు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం. శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు అంతగా అనుకూలించవు. ఉద్యోగాలలో పనిభారం.
వృషభం...పనుల్లో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వస్తు, వస్త్రలాభాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో విశేష గుర్తింపు.
మిథునం....శ్రమాధిక్యం. నిరుద్యోగులు, వ్యవసాయదారులకు నిరుత్సాహం. దైవదర్శనాలు. అనారోగ్యం. బంధువుల నుంచి ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని చికాకులు.
కర్కాటకం....నిరుద్యోగులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. పరిచయాలు మరింత పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనూహ్యమైన మార్పులు.
సింహం....ఏ పని చేపట్టినా స్వల్ప ఆటంకాలు తప్పవు. అనుకోని ప్రయాణాలు. సోదరులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. వ్యాపారాలలో గందరగోళం. ఉద్యోగాలలో కొన్ని మార్పులు.
కన్య.....సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. వస్తులాభాలు. కొత్త నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు అధిగమిస్తారు.
తుల...కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. వాహనయోగం. భూవివాదాలు పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో కొత్త హోదాలు.
వృశ్చికం...సన్నిహితులతో మాటపట్టింపులు. అనుకోని ఖర్చులు. ప్రయాణాలలో మార్పులు. చేపట్టిన పనులు వాయిదా. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో అదనపు పనిభారం.
ధనుస్సు...రుణదాతల ఒత్తిడులు. ఆ«లయ దర్శనాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా కొద్దిపాటి సమస్యలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు.
మకరం....పరిస్థితులు అనుకూలిస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.
కుంభం...సన్నిహితుల నుంచి ధనలాభం. నూతన వ్యక్తుల పరిచయం. శుభకార్యాలలో పాల్గొంటారు. వాహనయోగం. చర్చలు సఫలం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
మీనం...సన్నిహితులతో వివాదాలు. ధనవ్యయం. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. దైవదర్శనాలు. పనులు వాయిదా పడతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment