శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, తిథి: శు.ఏకాదశి సా.4.28 వరకు, తదుపరి ద్వాదశి, నక్షత్రం: ఉత్తరాషాఢ సా.5.43 వరకు, తదుపరి శ్రవణం, వర్జ్యం: రా.9.36 నుండి 11.08 వరకు, దుర్ముహూర్తం: ఉ.5.41 నుండి 7.27 వరకు, అమృతఘడియలు: ప.11.22 నుండి 12.56 వరకు; రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు, యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు, సూర్యోదయం: 5.50, సూర్యాస్తమయం: 6.03.
మేషం: కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. కీలక నిర్ణయాలు. వ్యవహార విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.
వృషభం: శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలలో అవాంతరాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.
మిథునం: వ్యవహారాలు ముందుకు సాగవు. మిత్రులతో కలహాలు. దైవదర్శనాలు. ఆస్తి కొనుగోలులో ఆటంకాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులకు సిద్ధపడాలి.
కర్కాటకం: పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఆసక్తికర సమాచారం. విందువినోదాలు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
సింహం: కొత్త వ్యక్తులు పరిచయం. శుభవార్తా శ్రవణం. ఆర్థికాభివృద్ధి. బంధువుల కలయిక. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి.
కన్య: పనుల్లో అవాంతరాలు. బంధువులతో తగాదాలు. దూరప్రయాణాలు. వృథా ఖర్చులు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు.
తుల: పనులు మందగిస్తాయి. శ్రమాధిక్యం. బంధువర్గంతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా సాగవు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు.
వృశ్చికం: వివాహయత్నాలు సానుకూలం. కొత్త విషయాలు తెలుస్తాయి. చిన్ననాటి మిత్రుల నుంచి పిలుపు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి.
ధనుస్సు: వ్యవహారాలలో ఆటంకాలు. కొత్త రుణాలు చేస్తారు. ప్రయాణాలు వాయిదా. ఆరోగ్య సమస్యలు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.
మకరం: సన్నిహితులతో వివాదాలు. ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. దూరప్రయాణాలు. నిర్ణయాలలో పొరపాట్లు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.
కుంభం: నూతన కార్యక్రమాలు చేపడతారు. ఇంటాబయటా మీదే పైచేయి. ఆప్తుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.
మీనం: స్థిరాస్తి వృద్ధి. పనుల్లో అవాంతరాలు. దూరప్రయాణాలు. సోదరులతో కలహాలు. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.
Comments
Please login to add a commentAdd a comment