ఈ రాశి వారు చిరకాల మిత్రులను కలుసుకుంటారు.. | Daily Horoscope On 15 January 2025 In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారు చిరకాల మిత్రులను కలుసుకుంటారు

Published Wed, Jan 15 2025 7:36 AM | Last Updated on Wed, Jan 15 2025 8:25 AM

Daily Horoscope On 15 January 2025 In Telugu

మేషం: వ్యవహారాలలో ప్రతిబంధకాలు. ఎంత శ్రమపడ్డా ఫలితం కనిపించదు. దైవదర్శనాలు చేసుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. వృత్తి, వ్యాపారాలు కాస్త అనుకూలం.

వృషభం: చిరకాల మిత్రులను కలుసుకుంటారు. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. వాహనసౌఖ్యం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహాన్నిస్తాయి.

మిథునం: కార్యక్రమాలు కొన్ని వాయిదా పడతాయి. దూరప్రయాణాలు. స్వల్ప అనారోగ్యం. సోదరుల నుండి ఒత్తిడులు రావచ్చు. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.

కర్కాటకం: ఇతరులకు సైతం సాయపడతారు. వస్తులాభాలు. ఆర్థికంగా అనుకూలస్థితి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి.

సింహం: శ్రమ పెరుగుతుంది. వ్యవహారాలలో ఆటంకాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా పడతాయి. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.

కన్య: ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. బంధువులను కలుసుకుంటారు. ఆలయ దర్శనాలు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.

తుల: ఉద్యోగ ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వృత్తి, వ్యాపారాలు సంతోషం కలిగిస్తాయి.

వృశ్చికం: మిత్రులతో వివాదాలు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పొల్గొంటారు. మానసిక అశాంతి. దూరప్రయాణాలు. వ్యాపార, ఉద్యోగాలలో సందిగ్ధ పరిస్థితి.

ధనుస్సు: రుణయత్నాలు సాగిస్తారు ఆరోగ్యం కొంత మందగిస్తుంది. పనుల్లో ప్రతిబంధకాలు. దూరప్రయాణాలు. ఆస్తుల విషయంలో చికాకులు. వృత్తి, వ్యాపారాలు నిరాశ పరుస్తాయి.

మకరం: రుణాలు వసూలవుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. విద్యార్థులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి కనిపిస్తుంది.

కుంభం: చిరకాల మిత్రుల కలయిక. విందువినోదాలు. కార్యజయం. ఆస్తులు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు ఫలిస్తాయి. సోదరులతో సఖ్యత.

మీనం: కొత్త రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. సోదరులు, మిత్రుల నుండి సమస్యలు ఎదురవుతాయి. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement