ఈ రాశి వారికి ప్రముఖులు పరిచయమవుతారు. వస్తులాభాలు. | Daily Horoscope On 15th December 2024 In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారికి ప్రముఖులు పరిచయమవుతారు. వస్తులాభాలు.

Published Sun, Dec 15 2024 4:31 AM | Last Updated on Sun, Dec 15 2024 9:13 AM

Daily Horoscope On 15th December 2024 In Telugu

శ్రీ క్రోధి నామ సంవత్సరం,దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, తిథి: పౌర్ణమి ప.2.36 వరకు తదుపరి బ.పాడ్యమి, నక్షత్రం: మృగశిర రా.3.26 వరకు, తదుపరి ఆరుద్ర, వర్జ్యం: ఉ.9.42 నుండి 11.15 వరకు, దుర్ముహూర్తం: సా.3.55 నుండి 4.41 వరకు, అమృతఘడియలు: సా.6.58 నుండి 8.32 వరకు.

సూర్యోదయం        :  6.22
సూర్యాస్తమయం    :  5.24
రాహుకాలం :  సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం : ప.12.00 నుంచి 1.30 వరకు 

మేషం....రుణాలు చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. బంధువర్గంతో విభేదాలు. పనులు వాయిదా. శ్రమాధిక్యం. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు.

వృషభం....కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖుల నుంచి పిలుపు. ఇంటర్వ్యూలు రాగలవు. వస్తులాభాలు. వృత్తి, వ్యాపారాలలో నూతనోత్సాహం.

మిథునం...ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. కొన్ని కార్యక్రమాలు మందగిస్తాయి. బంధువర్గంతో మాటపట్టింపులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

కర్కాటకం....వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. ఆస్తి వివాదాల పరిష్కారం. వృత్తి, వ్యాపారాలలో పురోగతి  ఉంటుంది.

సింహం.....రుణబాధలు తొలగుతాయి. చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి.

కన్య....వ్యవహారాలలో ఆటంకాలు. వృథా ఖర్చులు. దైవదర్శనాలు. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. స్వల్ప అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.

తుల....ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. శ్రమా«ధిక్యం. పనుల్లో తొందరపాటు. మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ.

వృశ్చికం....ప్రముఖులు పరిచయమవుతారు. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. వ్యాపారవృద్ధి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు.

ధనుస్సు...భూవివాదాల పరిష్కారం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యవహారాలలో ఆటంకాలు తొలగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి ఉంటుంది.

మకరం....వ్యయప్రయాసలు. బంధువర్గంతో విభేదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. అనుకోని ప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలలో చికాకులు.

కుంభం....పనులు ముందుకు సాగవు. వృథా ఖర్చులు. దూరప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. ఉద్యోగులకు పనిభారం.
మీనం....వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. పాతబాకీలు వసూలవుతాయి. కొన్ని సమస్యలు తీరతాయి. ఆస్తి లాభం. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement