శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, తిథి: బ.పాడ్యమి ప.1.14 వరకు, తదుపరి విదియ, నక్షత్రం: ఆరుద్ర రా.3.01 వరకు, తదుపరి పునర్వసు, వర్జ్యం: ఉ.11.43 నుండి 1.15 వరకు, దుర్ముహూర్తం: ప.12.15 నుండి 1.01 వరకు,తదుపరి ప.2.29 నుండి 3.11 వరకు, అమృతఘడియలు: సా.5.11 నుండి 6.45 వరకు, ధనుర్మాసం ప్రారంభం; రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు, యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు, సూర్యోదయం: 6.22, సూర్యాస్తమయం: 5.24.
మేషం..ఆశయాలు నెరవేరతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. కుటుంబంలో సమస్యలు తొలగుతాయి. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలు అనుకున్న విధంగా కొనసాగుతాయి.
వృషభం...కొత్త రుణాలు చేస్తారు. శ్రమాధిక్యంతో పనులు పూర్తి. ఉద్యోగయత్నాలు నత్తనడకన సాగుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు నిదానిస్తాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు. అనారోగ్యం.
మిథునం...పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో మరింత గౌరవం. ఆర్థిక వ్యవహారాలలో పురోగతి. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో హోదాలు దక్కుతాయి.
కర్కాటకం...ఆలోచనలు పరిపరివిధాలుగా ఉంటాయి. అనుకున్న పనులు ముందుకు సాగవు. కుటుంబంలో ఒత్తిళ్లు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.
సింహం....రుణబాధలు తొలగుతాయి. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన. వాహనయోగం. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో అవకాశాలు పెరుగుతాయి.
కన్య...కొత్త పరిచయాలు. సంఘంలో గౌరవం. భూవివాదాలు పరిష్కారం. శుభకార్యాల ప్రస్తావన. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.
తుల.....పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. ఆరోగ్యం మందగిస్తుంది. దూరప్రయాణాలు. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ
వృశ్చికం...శ్రమకు ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.
ధనుస్సు...పనులు చాకచక్యంగా పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. సోదరుల ద్వారా ధనలబ్ధి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. శ్రమ ఫలిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత సాఫీగా సాగుతాయి.
మకరం....సన్నిహితులు సాయపడతారు. ఆర్థిక ప్రగతి ఉంటుంది. వస్తులాభాలు. నూతన ఉద్యోగాన్వేషణ ఫలిస్తుంది. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.
కుంభం....మిత్రులతో విభేదాలు. అనుకున్న పనుల్లో ఆటంకాలు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత చికాకులు.
మీనం....శ్రమ తప్పదు. పనుల్లో జాప్యం. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆర్థిక విషయాలు అంతగా అనుకూలించవు. వ్యయప్రయాసలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంతమేర సమస్యలు.
Comments
Please login to add a commentAdd a comment