ఈ రాశి వారు ప్రారంభించిన పనుల్లో విజయం, ఆకస్మిక ధనలాభం | Daily Horoscope 20 September 2024 In Telugu | Sakshi
Sakshi News home page

ఈ రాశి వారు ప్రారంభించిన పనుల్లో విజయం, ఆకస్మిక ధనలాభం

Published Fri, Sep 20 2024 6:50 AM | Last Updated on Fri, Sep 20 2024 8:51 AM

Daily Horoscope 20 September 2024 In Telugu

శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, తిథి: బ.తదియ రా.1.41 వరకు, తదుపరి చవితి, నక్షత్రం: రేవతి ఉ.9.37 వరకు, తదుపరి అశ్వని, వర్జ్యం: తె.4.16, నుండి 5.46 వరకు (తెల్లవారితే శనివారం), దుర్ముహూర్తం: ఉ.8.16 నుండి 9.04 వరకు, తదుపరి ప.12.19 నుండి 1.08 వరకు, అమృత ఘడియలు: ఉ.7.35 నుండి 8.54 వరకు, తదుపరి రా.1.15 నుండి 2.56 వరకు.

సూర్యోదయం :    5.51
సూర్యాస్తమయం    :  5.58
రాహుకాలం : ఉ.10.30
నుండి 12.00 వరకు
యమగండం :  ప.3.00 నుండి 4.30 వరకు 

మేషం: ముఖ్యమైన పనులు ముందుకు సాగవు. కష్టించినా ఫలితం ఉండదు. రుణయత్నాలు. అనారోగ్యం. దూరప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు.

వృషభం: కుటుంబంలో ప్రోత్సాహం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు తీరతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు హోదాలు దక్కుతాయి.

మిథునం: దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో ఆటంకాలు తొలగుతాయి. వ్యాపార వృద్ధి. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం.

కర్కాటకం: పలుకుబడి పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన సమాచారం అందుతుంది. కార్యజయం. ఆస్తి ఒప్పందాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో నూతనోత్సాహం.

సింహం: అనుకున్న పనులలో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. ఇంటాబయటా చిక్కులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు.

కన్య: ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పాతమిత్రుల కలయిక. విందువినోదాలు. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు శ్రమఫలిస్తుంది..

తుల: బంధువులతో వివాదాలు తీరతాయి. ఆప్తులు, శ్రేయోభిలాషుల నుంచి ఆహ్వానాలు. ఆస్తిలాభం. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.

వృశ్చికం: రుణయత్నాలు సాగిస్తారు. ప్రయాణాలు వాయిదా. శ్రమ తప్పదు. పనుల్లో అవాంతరాలు. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో మార్పులు తథ్యం.

ధనుస్సు: ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యభంగం. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు పనిఒత్తిడులు.

మకరం: పలుకుబడి పెరుగుతుంది. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. బాకీలు వసూలవుతాయి. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.

కుంభం: కుటుంబంలో చికాకులు. దూరప్రయాణాలు. అనారోగ్యం. బంధువులతో అకారణంగా తగాదాలు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు పనిభారం.

మీనం: చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు. రాబడికి మించి ఖర్చులు. ఆరోగ్య సమస్యలు. సోదరులతో విభేదాలు.  దూరప్రయాణాలు. ఆలయ దర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో చికాకులు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement