
గ్రహం అనుగ్రహం: శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, తిథి: బ.షష్ఠి ప.1.41 వరకు తదుపరి సప్తమి, నక్షత్రం: పుబ్బ పూర్తి (24గంటలు), వర్జ్యం: ప.2.27 నుండి 4.11 వరకు, దుర్ముహూర్తం: ఉ.6.29 నుండి 7.55 వరకు, అమృతఘడియలు: రా.12.36 నుండి 2.31 వరకు.
సూర్యోదయం : 6.28
సూర్యాస్తమయం : 5.26
రాహుకాలం : ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం : ప.1.30 నుండి 3.00 వరకు
మేషం: ఆర్థిక ఇబ్బందులు. కొత్త రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. బాధ్యతలు పెరుగుతాయి. మానసిక ఆందోళన. వృత్తి, వ్యాపారాలలో కొన్ని అవాంతరాలు.
వృషభం: పరిస్థితులు అనుకూలించవు. వ్యవహారాలలో ప్రతిబంధకాలు. కుటుంబంలో కొన్ని సమస్యలు. అనారోగ్యం. దూరప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.
మిథునం: కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. ఆర్థికంగా బలం చేకూరుతుంది. సంఘంలో కీర్తి గడిస్తారు. వస్తులాభాలు. ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.
కర్కాటకం: సన్నిహితులతో విభేదాలు. అనారోగ్యం. ప్రయాణాలలో అవాంతరాలు. బంధువులను కలుసుకుంటారు. నిర్ణయాలు మార్పుచుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో ఇబ్బందికర పరిస్థితి.
సింహం: చాకచక్యంగా వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. వస్తులాభాలు. నూతన ఉద్యోగాలు లభించవచ్చు. ఆలయ దర్శనాలు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.
కన్య: కుటుంబంలో కొద్దిపాటి చిక్కులు. వ్యవహారాలు ముందుకు సాగవు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. మానసిక అశాంతి. వ్యాపార, ఉద్యోగాలలో ఇబ్బందులు.
తుల: చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. కార్యజయం. పరిచయాలు పెరుగుతాయి. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో మరింత సానుకూలత.
వృశ్చికం: ఉద్యోగాన్వేషణలో విజయం. శుభవార్తా శ్రవణం. ఆకస్మిక ధనలాభం. ప్రముఖుల కలయిక. విందువినోదాలు. వ్యాపార, ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం. దైవచింతన.
ధనుస్సు: రుణయత్నాలు సాగిస్తారు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కొన్ని సమస్యలు వేధిస్తాయి. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలు మందగిస్తాయి.
మకరం: పనుల్లో పొరపాట్లు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆరోగ్య సమస్యలు. వ్యాపార, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి.
కుంభం: కొత్త పనులలో విజయం సాధిస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఆస్తులు కొనుగోలు చేసే సమయం. కీలక సమాచారం అందుతుంది. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.
మీనం: ఇంతకాలం పడిన కష్టం ఫలిస్తుంది. ముఖ్యమైన పనుల్లో పురోగతి. ఆహ్వానాలు అందుతాయి. బంధువులతో సత్సంబంధాలు. వాహనయోగం. వ్యాపార , ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.
Comments
Please login to add a commentAdd a comment