గ్రహం అనుగ్రహం: శ్రీ క్రోధి నామ సంవత్సరం,దక్షిణాయనం,హేమంత ఋతువు మార్గశిర మాసం, తిథి: బ.సప్తమి ప.3.18 వరకు తదుపరి అష్టమి, నక్షత్రం: పుబ్బ ఉ.7.47 వరకు తదుపరి ఉత్తర,వర్జ్యం: ప.3.41 నుండి 5.25 వరకు, దుర్ముహూర్తం: ప.4.04 నుండి 4.52 వరకు, అమృతఘడియలు: రా.2.10 నుండి 3.51 వరకు.
సూర్యోదయం : 6.30
సూర్యాస్తమయం : 5.27
రాహుకాలం : సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం : ప.12.00 నుంచి 1.30 వరకు
మేషం.....పనులలో అడ్డంకులు. ఆస్తి వివాదాలు. శ్రమాధిక్యం. మిత్రుల నుంచి విమర్శలు. దైవచింతన. ఆకస్మిక ప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలలో కొద్దిపాటి చికాకులు పెరుగుతాయి.
వృషభం...రుణాలు చేస్తారు. ఎంత శ్రమపడ్డా ఫలితం ఉండదు. ప్రయాణాలలో మార్పులు. ఆస్తి వివాదాలు. మిత్రులతో విభేదాలు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.
మిథునం....ప్రముఖుల సలహాలు స్వీకరిస్తారు. కొన్ని బాకీలు వసూలవుతాయి. ఆధ్యాత్మిక చింతన. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.
కర్కాటకం...కుటుంబంలో ఒత్తిడులు. ఆరోగ్య సమస్యలు. బంధువులతో స్వల్ప విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు ఇబ్బందిగా మారవచ్చు.
సింహం.....ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. అదనపు ఆదాయం. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. వాహనయోగం. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.
కన్య....శ్రమ తప్పదు. ముఖ్యమైన పనుల్లో అవాంతరాలు. భూ వివాదాలు. దైవదర్శనాలు. ఇంటర్వ్యూలు నిరాశ పరుస్తాయి. వృత్తి, వ్యాపారాలలో కొన్ని సమస్యలు.
తుల....పనులు సకాలంలో పూర్తి. దైవదర్శనాలు. నూతన ఉద్యోగప్రాప్తి. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. వాహనయోగం. సోదరులతో సఖ్యత ఏర్పడుతుంది.
వృశ్చికం...కొత్త విషయాలు గ్రహిస్తారు. చర్చల్లో కొంత పురోగతి. మిత్రుల నుంచి ముఖ్య సమాచారం. వాహనయోగం. వృత్తి, వ్యాపారాలలో మీ కృషి ఫలిస్తుంది. దైవచింతన.
ధనుస్సు.....చేపట్టిన పనులు కొంత నిదానిస్తాయి. ఆలోచనలు కలసిరావు. కుటుంబసమస్యలు ఎదురవుతాయి. దూరప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలలో కొన్ని అడ్డంకులు.
మకరం....ముఖ్యమైన వ్యవహారాలు కొన్ని వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా గందరగోళ పరిస్థితి. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలలో చికాకులు.
కుంభం...బాకీలు వసూలవుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు. ఆస్తిలాభం. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం. వృత్తి, వ్యాపారాలలో అనుకూల పరిస్థితులు.
మీనం...వ్యవహారాలలో విజయం. ఆప్తుల నుండి శుభవార్తలు. వాహనయోగం. చర్చలు సఫలం. కీలక నిర్ణయాలు. వృత్తి, వ్యాపారాలలో చిక్కులు తొలగుతాయి.
Comments
Please login to add a commentAdd a comment