గ్రహం అనుగ్రహం: శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు మార్గశిర మాసం, తిథి: బ.నవమి రా.7.20 వరకు, తదుపరి దశమి, నక్షత్రం: హస్త ప.12.35 వరకు, తదుపరి చిత్త,వర్జ్యం: రా.9.29 నుండి 11.13 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.43 నుండి 9.31 వరకు తదుపరి రా.10.44 నుండి 11.32 వరకు, అమృతఘడియలు: లేవు.
సూర్యోదయం : 6.31
సూర్యాస్తమయం : 5.28
రాహుకాలం : ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం : ఉ.9.00 నుండి 10.30 వరకు
మేషం....ఉద్యోగ ప్రయత్నాలలో విజయం. విందువినోదాలు. సోదరుల నుంచి భూ, ధనలాభాలు. యత్నకార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.
వృషభం....ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా సమస్యలు. ఆరోగ్యభంగం. శ్రమ పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.
మిథునం....పనులు నత్తనడకన సాగుతాయి. దూరప్రయాణాలు. కొత్తగా అప్పులు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఊహించని
మార్పులు.
కర్కాటకం...ఇంటర్వ్యూలలో విజయం. ఆప్తులు అన్నింటా సహకరిస్తారు. ఎంతటి వారినైనా ఆకట్టుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.
సింహం....కొన్ని పనులు మధ్యలో విరమిస్తారు. ప్రయాణాలలో మార్పులు.స్నేహితులతో అకారణంగా తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు,ఉద్యోగాలలో గందరగోళం.
కన్య....ఆదాయం పెరుగుతుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులు, బంధువుల తోడ్పాటు లభిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో
అనుకూల పరిస్థితి.
తుల....ప్రయాణాలు వాయిదా వేస్తారు. పనులు మందగిస్తాయి. విద్యార్థులకు అంతగా అనుకూలించదు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు
చోటుచేసుకుంటాయి.
వృశ్చికం....పరిచయాలు పెరుగుతాయి. ఆదాయం సంతృప్తినిస్తుంది. కార్యజయం.శుభకార్యాలకు హాజరవుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి. కీలక నిర్ణయాలు.
ధనుస్సు....కొత్త పనులు చేపడతారు. అందరిలోనూ గౌరవం. భూవివాదాలు తీరతాయి. గృహ, వాహనయోగాలు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందుకు సాగుతారు.
మకరం....ఉద్యోగ ప్రయత్నాలలో అవరోధాలు. బంధువులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. పనులలో ఆటంకాలు. దేవాలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.
కుంభం....కుటుంబంలో చికాకులు. మనశ్శాంతి లోపిస్తుంది. అంచనాలు తప్పుతాయి. బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి.
మీనం....ఆప్తుల నుంచి శుభవర్తమానాలు. అదనపు ఆదాయం సమకూరుతుంది. సన్నిహితులు, శ్రేయోభిలాషుల సలహాలు స్వీకరిస్తారు. విలువైన వస్తువులు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment