
గ్రహం అనుగ్రహం: శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్య మాసం, తిథి: బ.త్రయోదశి రా.7.46 వరకు, తదుపరి చతుర్దశి, నక్షత్రం: మూల ఉ.8.20 వరకు, తదుపరి పూర్వాషాఢ, వర్జ్యం: ఉ.6.41 నుండి 8.21 వరకు, తదుపరి సా.6.12 నుండి 7.48 వరకు,దుర్ముహూర్తం: ప.12.38 నుండి 1.26 వరకు, తదుపరి ప.2.53 నుండి 3.41 వరకు, అమృతఘడియలు: తె.4.01 నుండి 5.41 వరకు; రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు, యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు, సూర్యోదయం: 6.38, సూర్యాస్తమయం: 5.49.
మేషం... కొన్ని పనులు మధ్యలో వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. కుటుంబంలో కొన్ని సమస్యలు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితి.
వృషభం.. వ్యయప్రయాసలు. బంధువుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. ఆరోగ్యభంగం. కొన్ని వ్యవహారాలలో ఆటంకాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త సమస్యలు.
మిథునం... కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తా శ్రవణం. ఆర్థిక ప్రగతి. కొన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆశ్చర్యకర సంఘటనలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు నిజం కాగలవు.
కర్కాటకం... శుభవార్తలు వింటారు. దూరపు బంధువుల కలయిక. ఇంటాబయటా అనుకూల పరిస్థితి. విలువైన వస్తువులు సేకరిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మంచి గుర్తింపు.
సింహం.... పనులు మధ్యలో విరమిస్తారు. శ్రమాధిక్యం. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. దైవదర్శనాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.
కన్య.... ఆదాయం కంటే ఖర్చులు అధికం. పనుల్లో తొందరపాటు. దూరప్రయాణాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు.
తుల... బంధువుల ద్వారా శుభవార్తలు. వాహనయోగం. ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు తొలగుతాయి. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.
వృశ్చికం... స్నేహితులతో తగాదాలు. ప్రయాణాలలో మార్పులు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.
ధనుస్సు... పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ధనలాభం. కార్యసిద్ధి. ఉద్యోగార్ధులకు శుభవార్తలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అభివృద్ధి.
మకరం..... సన్నిహితులు, మిత్రులతో విభేదాలు. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. శ్రమాధిక్యం. కొన్ని వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. వ్యయప్రయాసలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత ఇబ్బంది.
కుంభం... మిత్రులతో వివాదాలు సర్దుకుంటాయి. ఆకస్మిక ధనలాభం. ప్రముఖులతో పరిచయాలు. దైవదర్శనాలు. ఉద్యోగయత్నాలలో అనుకూలత. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.
మీనం... అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి. సంఘంలో గౌరవం. ఆస్తి తగాదాలు కొలిక్కి వస్తాయి. వాహనయోగం. వ్యాపారాలు విస్తరణలో పురోగతి. ఉద్యోగాలలో ప్రోత్సాహం.