
గ్రహం అనుగ్రహం: శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు పుష్య మాసం , తిథి: బ.చతుర్దశి రా.7.38 వరకు, తదుపరి అమావాస్య, నక్షత్రం: పూర్వాషాఢ ఉ.8.58 వరకు, తదుపరి ఉత్తరాషాఢ, వర్జ్యం: సా.5.02 నుండి 6.38 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.53 నుండి 9.41 వరకు, తదుపరి రా.11.00 నుండి 11.48 వరకు, అమృత ఘడియలు: రా.2.40 నుండి 4.17 వరకు, మాసశివరాత్రి
సూర్యోదయం : 6.38
సూర్యాస్తమయం : 5.49
రాహుకాలం : ప.3.00
నుండి 4.30 వరకు
యమగండం : ఉ.9.00 నుండి 10.30 వరకు
మేషం..శ్రమ మరింత పెరుగుతుంది. వ్యవహారాలలో ఆటంకాలు. రాబడికి మించి ఖర్చులు. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహం.
వృషభం....కుటుంబంలో ఒత్తిడులు. ముఖ్యకార్యక్రమాలు వాయిదా. అనారోగ్యం. విద్యార్థులకు నిరాశ. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.
మిథునం....కుటుంబంలో శుభకార్యాలు. ఆకస్మిక ధనలాభం. అప్రయత్న కార్యసిద్ధి. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.
కర్కాటకం.. ఆలోచనలు అమలు చేస్తారు. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు. వృత్తి, వ్యాపారాలు మరింత అనుకూలిస్తాయి.
సింహం....పనులు మందగిస్తాయి. అనుకోని ప్రయాణాలు. ఇంటాబయటా సమస్యలు. బంధువులతో తగాదాలు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.
కన్య....కుటుంబసభ్యులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వృథా ఖర్చులు. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి.
తుల...కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. ఆకస్మిక ధన, వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.
వృశ్చికం...దూరప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. పనులు ముందుకు సాగవు. ఆర్థిక ఇబ్బందులు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.
ధనుస్సు....కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తా శ్రవణం. ఆర్థికాభివృద్ధి. పోటీపరీక్షల్లో విజయం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు హోదాలు.
మకరం....ముఖ్య నిర్ణయాలు వాయిదా. శ్రమాధిక్యం. మిత్రులతో అకారణంగా తగాదాలు. దూరప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు.
కుంభం..శ్రమ అనుకూలిస్తుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన. ధనలాభం. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.
మీనం....కుటుంబంలో సంతోషకరంగా ఉంటుంది. ఆర్థిక ప్రగతి. ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహం.
Comments
Please login to add a commentAdd a comment