శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు,కార్తీక మాసం, తిథి: బ.త్రయోదశి పూర్తి (24 గంటలు),నక్షత్రం: చిత్త ఉ.7.53 వరకు తదుపరి స్వాతి,వర్జ్యం: ప.2.05 నుండి 3.49 వరకు, దుర్ముహూర్తం: ఉ.9.59 నుండి 10.47 వరకు, తదుపరి ప.2.26 నుండి 3.14 వరకు,అమృతఘడియలు: రా.12.35 నుండి 2.23 వరకు.
సూర్యోదయం : 6.16
సూర్యాస్తమయం : 5.20
రాహుకాలం : ప.1.30
నుండి 3.00 వరకు
యమగండం : ఉ.6.00 నుండి 7.30 వరకు
మేషం...ఆకస్మిక ధనలాభం. కార్యసిద్ధి. ప్రముఖుల నుంచి కీలక సందేశం. విలువైన వస్తువులు సేకరిస్తారు. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.
వృషభం....పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. ఆరోగ్యభంగం. శ్రమ పడ్డా పనులు ముందుకు సాగవు. వ్యాపార, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి.
మిథునం..నూతనోత్సాహంతో పనులు పూర్తి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. బాకీలు వసూలవుతాయి. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.
కర్కాటకం....దూరపు బంధువులను కలుసుకుంటారు. ఆస్తి వ్యవహారాలలో ఒప్పందాలు. ఆకస్మిక ధనలాభం. పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో అంచనాలు నిజమవుతాయి.
సింహం....వ్యవహారాలలో ఆటంకాలు. బంధువిరోధాలు. శ్రమాధిక్యం. అనారోగ్యం. కుటుంబసమస్యలు. చర్చలలో ప్రతిష్ఠంభన. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిళ్లు. దైవదర్శనాలు.
కన్య....వ్యవహారాలలో ఆటంకాలు. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. బంధువులతో విభేదాలు. ఆలయాలు సందర్శిస్తారు. అనారోగ్య సూచనలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిళ్లు.
తుల..కొత్త విషయాలు తెలుస్తాయి. పరిచయాలు పెరుగుతాయి. బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.
వృశ్చికం..కుటుంబసభ్యులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. నిరుద్యోగులకు శ్రమాధిక్యం. దూరప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.
ధనుస్సు...కుటుంబంలో ఉత్సాహవంతంగా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. వస్తు, వస్త్రలాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు.
మకరం....అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం. బంధువులతో ఉల్లాసంగా గడుపుతారు. ఇంటర్వ్యూలు రాగలవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
కుంభం...కుటుంబసమస్యలు. వ్యవహారాలలో అవాంతరాలు. బంధుమిత్రులతో విభేదాలు. అనారోగ్యం. విద్యార్థులకు కొద్దిపాటి ఇబ్బందులు. వ్యాపార, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.
మీనం....బంధువుల నుంచి ఒత్తిళ్లు. శ్రమాధిక్యం. పనులు వాయిదా వేస్తారు. ఆరోగ్యసమస్యలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు.
Comments
Please login to add a commentAdd a comment