గ్రహం అనుగ్రహం: శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, తిథి: బ.చతుర్దశి ఉ.9.40 వరకు, తదుపరి అమావాస్య, నక్షత్రం: విశాఖ ప.12.39 వరకు, తదుపరి అనూరాధ, వర్జ్యం: సా.4.58 నుండి 6.38 వరకు, దుర్ముహూర్తం: ఉ.6.03 నుండి 7.49 వరకు, అమృతఘడియలు: రా.3.11 నుండి 4.55 వరకు; రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు, యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు, సూర్యోదయం: 6.16, సూర్యాస్తమయం: 5.20.
మేషం: ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక వ్యవహారాలలో నిరుత్సాహం. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి మార్పులు.
వృషభం: బంధువుల సలహాలు స్వీకరిస్తారు. ఆహ్వానాలు అందుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. వస్తు, వస్త్రలాభాలు.
మిథునం: పనులలో విజయం. శుభవార్తలు అందుతాయి. శ్రమకు ఫలితం కనిపిస్తుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి.
కర్కాటకం: కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
సింహం: ఆర్థిక పరిస్థితి నిరాశాజనకంగా ఉంటుంది. ధనవ్యయం. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. అనారోగ్యం. బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.
కన్య: ఉద్యోగయత్నాలు సానుకూలం. విలువైన వస్తువులు సేకరిస్తారు. బంధువుల కలయిక. ఆస్తిలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.
తుల: దూరప్రయాణాలు. పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బంది కలిగిస్తుంది. అనుకోని ధనవ్యయం. పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు కలసిరావు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.
వృశ్చికం: కొత్త పనులు చేపడతారు. బంధువుల నుంచి శుభవార్తలు. ఆర్థిక ప్రగతి. ప్రముఖులతో పరిచయాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.
ధనుస్సు: ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహపరుస్తుంది. ధనవ్యయం. శ్రమాధిక్యం. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన.
మకరం: విద్యార్థులకు అనుకూల ఫలితాలు. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు సేకరిస్తారు. బంధువుల తోడ్పాటు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
కుంభం: కొత్త పనులు ప్రారంభిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
మీనం: బంధువులతో మాటపట్టింపులు. ఆరోగ్యభంగం. పనులలో జాప్యం. వ్యయప్రయాసలు. వ్యాపారాలు,ఉద్యోగాలలో కొన్ని మార్పులు. దైవదర్శనాలు.
Comments
Please login to add a commentAdd a comment