గ్రహఫలం.. మంగళవారం, 27.08.24
శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం,
తిథి: బ.అష్టమి ఉ.6.48 వరకు, తదుపరి నవమి తె.5.11 వరకు,
నక్షత్రం: రోహిణి రా.8.28 వరకు, తదుపరి మృగశిర,
సూర్యోదయం: 5.48, సూర్యాస్తమయం: 6.17.
వర్జ్యం: ప.12.45 నుండి 2.17 వరకు, తదుపరి రా.1.58 నుండి 3.30 వరకు,
దుర్ముహూర్తం: ఉ.8.18 నుండి 9.06 వరకు, తదుపరి రా.10.54 నుండి 11.42 వరకు,
రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు,
యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు,
అమృతఘడియలు: సా.5.31 నుండి 7.04 వరకు;
మేషం: ప్రయాణాలు చివరిలో వాయిదా. శ్రమాధిక్యం. మిత్రులతో విభేదాలు. పనులు మందకొడిగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో సమస్యలు.
వృషభం: పరిచయాలు పెరుగుతాయి. ఆస్తి వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. వాహనయోగం. చర్చల్లో పురోగతి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం. వస్తులాభాలు.
మిథునం: శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. ఆర్థిక ఇబ్బందులు. కొత్త రుణయత్నాలు. మిత్రులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ముందుకు సాగక డీలాపడతారు.
కర్కాటకం: కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. ఆస్తి లాభసూచనలు. ప్రముఖుల పరిచయం. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. బాకీలు సైతం వసూలవుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో మరింత రాణింపు.
సింహం: నూతన ఉద్యోగాలు దక్కుతాయి. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. భూవివాదాల పరిష్కారం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాలలో అధిక లాభాలు. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.
కన్య: కొత్త పనులు చేపడతారు. ఆలోచనలు అమలు చేస్తారు. సంఘంలో గౌరవం. వస్తులాభాలు. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
తుల: బంధువులతో వివాదాలు. ధనవ్యయం. ఆధ్యాత్మిక చింతన. పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. వృత్తి, వ్యాపారాలలో మార్పులు. దైవదర్శనాలు.
వృశ్చికం: వ్యయప్రయాసలు. బంధువులు,మిత్రులతో కలహాలు. కొత్త రుణయత్నాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు.
ధనుస్సు: నూతన ఉద్యోగయోగం. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. దైవదర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
మకరం: దూరపు బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. భూములు, వాహనాలు కొంటారు. పోటీపరీక్షల్లో విజయం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం.
కుంభం: పనుల్లో ప్రతిబంధకాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా సమస్యలు. ఆరోగ్యభంగం. శ్రమ తప్పదు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో కొత్త సమస్యలు.
మీనం: ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. స్వల్ప అనారోగ్యం. పనుల్లో జాప్యం. వృత్తి, వ్యాపారాలు గందరగోళంగా ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment