మేషం: నూతనోత్సాహం. పనులలో విజయం. ఆప్తుల నుంచి ధనలాభం. ఆస్తి వివాదాలు పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.
వృషభం: కొత్త పనులు ప్రారంభిస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. ప్రముఖుల పరిచయాలు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలస్థితి.
మిథునం: శ్రమకు ఫలితం కనిపించదు. వ్యవహారాలలో నిరుత్సాహం. ధనవ్యయం. ఆర్థిక పరిస్థితి కొంత మందగిస్తుంది. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.
కర్కాటకం: వ్యవహారాలలో జాప్యం. ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహపరుస్తుంది. కొత్త బాధ్యతలు. ఆలయ దర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో కొన్ని మార్పులు. అనారోగ్యం.
సింహం: కొత్త విషయాలు గ్రహిస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. పనులు సజావుగా సాగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.
కన్య: పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు కొంటారు. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి. విందువినోదాలు.
తుల: ఆర్థిక లావాదేవీలు అంతగా అనుకూలించవు. ధనవ్యయం. బంధువులు, మిత్రులతో వివాదాలు. పనుల్లో జాప్యం. ఆరోగ్యభంగం. శ్రమ పెరుగుతుంది. ఉద్యోగాలలో మార్పులు.
వృశ్చికం: మిత్రులతో మాటపట్టింపులు. ధనవ్యయం. కుటుంబంలో ఒత్తిడులు. అదనపు బాధ్యతలు. వ్యాపార, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి. ఆరోగ్యభంగం.
ధనుస్సు: ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం. ఆస్తి వివాదాలు తీరతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పరిచయాలు పెరుగుతాయి. వాహన, గృహయోగాలు. వ్యాపార వృద్ధి.
మకరం: కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. ఆలోచనలు కలిసిరావు. ఇంటాబయటా ఒత్తిడులు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.
కుంభం: కొత్త ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. ఇంటిలో శుభకార్యాలు. ఆకస్మిక ధనలాభం. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం. శుభవార్తలు.
మీనం: శ్రమాధిక్యం. బంధువులు, మిత్రులతో మాటపట్టింపులు. వ్యయప్రయాసలు. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment