శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, శర దృతువు, కార్తీక మాసం, తిథి: శు.చవితి రా.9.32 వరకు, తదుపరి పంచమి, నక్షత్రం: జ్యేష్ఠ ఉ.8.21 వరకు, తదుపరి మూల, వర్జ్యం: సా.4.38 నుండి 6.17 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.21 నుండి 9.09 వరకు తదుపరి రా.10.31 నుండి 11.19 వరకుు, అమృతఘడియలు: రా.2.31 నుండి 4.10 వరకు, నాగుల చవితి; రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు, యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు, సూర్యోదయం: 6.03, సూర్యాస్తమయం: 5.25.
మేషం: పనుల్లో ఆటంకాలు. వ్యయప్రయాసలు. బం«ధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో పని ఒత్తిడులు.
వృషభం: పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు కలసిరావు. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. శ్రమ తప్పదు. బంధువులతో అకారణంగా తగాదాలు. వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాలలో మార్పులు.
మిథునం: వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల సలహాలు పొందుతారు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.
కర్కాటకం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో మరింత గుర్తింపు.
సింహం: పనులు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో తగాదాలు. ఆర్థిక ఇబ్బందులు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో పనిభారం.
కన్య: పనులలో ఆటంకాలు. రుణయత్నాలు. దూరప్రయాణాలు. కుటుంబంలో సమస్యలు. బంధువిరోధాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో చికాకులు.
తుల: ఆత్మీయుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు. మీ సత్తా చాటుకుంటారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం.
వృశ్చికం: పనులలో జాప్యం. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువులతో తగాదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు.
ధనుస్సు: కొత్త పనులకు శ్రీకారం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాత మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. కాంట్రాక్టులు దక్కుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో నూతన హోదాలు.
మకరం: శ్రమ తప్పకపోవచ్చు. పనుల్లో ప్రతిష్ఠంభన. బంధువులతో తగాదాలు. కష్టపడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో నిరుత్సాహం.
కుంభం: పరిస్థితులు అనుకూలిస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వస్తులాభాలు. వ్యాపారాలలో మరింత అనుకూలత. ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి.
మీనం: పనులు వేగంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ముఖ్య సమాచారం. విందువినోదాలు. ఆహ్వానాలు రాగలవు. ఆస్తిలాభం. వ్యాపారాలలో మరింత లాభాలు. ఉద్యోగాలలో అనుకూలత.
Comments
Please login to add a commentAdd a comment