ఈ రాశి వారు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు | Today Telugu Horoscope On November 6th, 2024: Know Astrological Predictions Of Your Zodiac Signs In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు

Published Wed, Nov 6 2024 6:23 AM | Last Updated on Thu, Nov 7 2024 6:49 AM

Daily Horoscope On November 06, 2024 In Telugu

శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, శర దృతువు, కార్తీక మాసం,తిథి: శు.పంచమి రా.9.26 వరకు, తదుపరి షష్ఠి, నక్షత్రం: మూల ఉ.9.09 వరకు, తదుపరి పూర్వాషాఢ, వర్జ్యం: ఉ.7.32 నుండి 9.08 వరకు,తదుపరి సా.6.53  నుండి 8.31 వరకు, దుర్ముహూర్తం: ఉ.11.23 నుండి 12.11 వరకు, అమృతఘడియలు: తె.4.37 నుండి 6.13 వరకు (తెల్లవారితే గురువారం). 

మేషం: కొన్ని వ్యవహారాలలో అవాంతరాలు. రుణఒత్తిడులు. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. అనారోగ్యం. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో సమస్యలు.

వృషభం: దూరప్రయాణాలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు. ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. పనులు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

మిథునం: శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆకస్మిక ధనలబ్ధి. ముఖ్య నిర్ణయాలు. వ్యవహారాలలో అనుకూలత. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఎదురులేని పరిస్థితి.

కర్కాటకం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. వాహనయోగం. బంధువుల నుంచి ధనలాభం. పాతమిత్రుల కలయిక. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహం.

సింహం: పనుల్లో అవాంతరాలు. కొత్త రుణయత్నాలు. కష్టపడ్డా ఫలితం కనిపించదు. భూవివాదాలు. ఆరోగ్యసమస్యలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు.

కన్య: వ్యయప్రయాసలు. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక చింతన. అనారోగ్యం. పనుల్లో అవాంతరాలు. ప్రయాణాలు రద్దు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ.

తుల: బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. సంఘంలో గౌరవం. ఆస్తి, ధనలాభాలు. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.

వృశ్చికం: ముఖ్యమైన వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు. రుణయత్నాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువర్గం నుంచి ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

ధనుస్సు: ఆర్థిక లాభాలు ఉంటాయి. సన్నిహితులతో వివాదాలు పరిష్కారం. శుభవార్తా శ్రవణం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి.

మకరం: సన్నిహితులతో విభేదాలు. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. పనుల్లో అవాంతరాలు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి.

కుంభం: పనులలో పురోగతి. ఇంటాబయటా అనుకూలం. కొత్త విషయాలు తెలుస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సోదరులతో సఖ్యత. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.

మీనం: సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. ఆస్తి ఒప్పందాలు. వస్తులాభాలు. ముఖ్యమైన పనుల్లో విజయం. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement