ఈ రాశివారికి ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది.. | Today Telugu Horoscope On November 7th, 2024: Know Astrological Predictions Of Your Zodiac Signs In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశివారికి ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది..

Published Thu, Nov 7 2024 6:53 AM | Last Updated on Thu, Nov 7 2024 8:53 AM

Daily Horoscope On November 07, 2024 In Telugu

శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, శర దృతువు కార్తీక మాసం, తిథి: శు.షష్ఠి రా.8.54 వరకు, తదుపరి సప్తమి,నక్షత్రం: పూర్వాషాఢ ఉ.9.27 వరకు, తదుపరి ఉత్తరాషాఢ, వర్జ్యం: సా.5.20 నుండి 6.52 వరకు, దుర్ముహూర్తం: ఉ.9.52 నుండి 10.40 వరకు, తదుపరి ప.2.25 నుండి 3.13 వరకు,అమృతఘడియలు: రా.2.55 నుండి 4.30 వరకు. 

మేషం: పనుల్లో అవాంతరాలు. ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. శ్రమాధిక్యం. బంధువులతో తగాదాలు. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో కొన్ని సమస్యలు.

వృషభం: ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. సన్నిహితులు, మిత్రులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా కొనసాగుతాయి.

మిథునం: మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. స్థిరాస్తి లాభం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో శ్రమ ఫలిస్తుంది.

కర్కాటకం: కొత్త వ్యూహాలతో ముందుకు సాగుతారు. విద్యార్థులకు శుభవార్తలు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీ అంచనాలు ఫలిస్తాయి.

సింహం: కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. పనులు ముందుకు సాగవు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

కన్య: బంధువులు, మిత్రులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. అనారోగ్యం. శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

తుల: వ్యవహారాలలో మరింత అనుకూలత. స్థిరాస్తి వృద్ధి. బంధువుల రాక ఉత్సాహాన్నిస్తుంది. వాహనసౌఖ్యం. ఉద్యోగలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.

వృశ్చికం: కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ప్రయాణాలు రద్దు. బంధువులతో తగాదాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

ధనుస్సు: నూతన ఉద్యోగాలు దక్కించుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు. వ్యవహారాలలో పురోగతి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రతిభ చాటుకుంటారు.

మకరం: పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు. బంధువులతో మాటపట్టింపులు. పనుల్లో అవాంతరాలు. రుణాలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

కుంభం: కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆలయ దర్శనాలు. బంధువుల నుంచి ఆహ్వానాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు.

మీనం: శుభకార్యాలలో పాల్గొంటారు. కొన్ని బాకీలు వసూలవుతాయి. సన్నిహితులతో సఖ్యత. గృహయోగం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకూలత.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement