Daily Horoscope: ఈ రాశివారికి ధనలబ్ధి.. కొత్త పనులు చేపడతారు | Today Telugu Horoscope On November 8th, 2024: Know Astrological Predictions Of Your Zodiac Signs In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశివారికి ధనలబ్ధి.. కొత్త పనులు చేపడతారు

Published Fri, Nov 8 2024 5:16 AM | Last Updated on Fri, Nov 8 2024 10:22 AM

Daily Horoscope On November 08, 2024 In Telugu

శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, శర దృతువు, కార్తీక మాసం, తిథి: శు.సప్తమి రా.7.35 వరకు, తదుపరి అష్టమి, నక్షత్రం: ఉత్తరాషాఢ ఉ.9.03 వరకు, తదుపరి శ్రవణం, వర్జ్యం: ప.1.01 నుండి 2.33 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.21 నుండి 9.09 వరకు, తదుపరి ప.12.09 నుండి 12.57 వరకు, అమృత ఘడియలు: రా.10.33 నుండి 12.06 వరకు; రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు, యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు, సూర్యోదయం: 6.04, సూర్యాస్తమయం: 5.24.

మేషం: కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆర్థిక వ్యవహారాలు పురోగతిలో ఉంటాయి. వస్తులాభాలు. వృత్తి, వ్యాపారాలలో అనుకూలస్థితి. విద్యార్థుల కృషి ఫలిస్తుంది.

వృషభం: వ్యయప్రయాసలు. పనులలో కొద్దిపాటి ఆటంకాలు. బంధువులతో మాటపట్టింపులు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు. కళాకారులకు వివాదాలు.

మిథునం: సన్నిహితులతో మాటపట్టింపులు. ధనవ్యయం. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు. దూరపు బంధువుల కలయిక. అనుకున్న పనుల్లో జాప్యం. దైవదర్శనాలు.

కర్కాటకం: ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. సంఘంలో పరపతి పెరుగుతుంది. వస్తు, వస్త్రలాభాలు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. స్థిరాస్తి వివాదాల పరిష్కారం.

సింహం: పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో పురోగతి. ఆహ్వానాలు రాగలవు.

కన్య: బంధువులతో మాటపట్టింపులు. రుణాలు చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. ఇంటాబయటా ఒత్తిడులు.వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహం. కళాకారులకు ఒత్తిడులు.

తుల: కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. ధనవ్యయం. ఉద్యోగయత్నాలు నిరాశ కలిగిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు. విద్యార్థులకు శ్రమాధిక్యం.

వృశ్చికం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. ఆర్థిక పరిస్తితి ఆశాజనకంగా ఉంటుంది. వ్యవహారాలలో విజయం. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.

ధనుస్సు: ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. ధనవ్యయం. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. వృత్తి, వ్యాపారాలలో మార్పులు. కళాకారులకు చికాకులు.

మకరం: ఆర్థికాభివృద్ధి. నూతన ఉద్యోగయోగం. ముఖ్య నిర్ణయాలు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. దైవదర్శనాలు. కళాకారులకు శుభవార్తలు.

కుంభం: ధనవ్యయం. ఇంటాబయటా ఒత్తిడులు. బంధువుల నుంచి ముఖ్య సమాచారం. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళం. విద్యార్థులకు నిరుత్సాహం.

మీనం: సంఘంలో గౌరవం. ఆప్తుల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వస్తులాభాలు. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు. విద్యార్థుల యత్నాలు సఫలం. 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement