శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, శర దృతువు, కార్తీక మాసం, తిథి: శు.అష్టమి సా.6.25 వరకు, తదుపరి నవమి, నక్షత్రం: శ్రవణం ఉ.8.42 వరకు, తదుపరి ధనిష్ఠ, వర్జ్యం: ప.12.33 నుండి 2.05 వరకు, దుర్ముహూర్తం: ఉ.5.52 నుండి 7.38 వరకు, అమృతఘడియలు: రా.9.46 నుండి 11.20 వరకు; రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు, యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు, సూర్యోదయం: 6.05, సూర్యాస్తమయం: 5.23.
మేషం: ప్రయాణాలలో మార్పులు. అనారోగ్యం. కుటుంబసభ్యులతో తగాదాలు. ధనవ్యయం. మానసిక అశాంతి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని సమస్యలు.
వృషభం: రుణబాధలు తప్పవు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసమస్యలతో సతమతమవుతారు. బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.
మిథునం: కొత్త వ్యక్తులతో పరిచయం. శుభవార్తలు. వాహనాలు కొంటారు. పలుకుబడి పెరుగుతుంది. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఎదురులేని పరిస్థితి.
కర్కాటకం: గతం గుర్తుకు తెచ్చుకుంటారు. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఆకస్మిక ధనలబ్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీదే పైచేయిగా ఉంటుంది.
సింహం: పరిస్థితులు కలిసిరావు. కుటుంబబాధ్యతలు అధికమవుతాయి. కష్టం మీది ఫలితం వేరొకరిదిగా ఉంటుంది. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని మార్పులు.
కన్య: నిరుద్యోగుల యత్నాలు కలసిరావు. బాధ్యతలు అథికమవుతాయి. ఆలోచనలు స్థిరంగా సాగవు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.
తుల: కొన్ని వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ప్రముఖుల నుంచి అందిన సమాచారం ఊరటనిస్తుంది. బంధువుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఊహించని అవకాశాలు.
వృశ్చికం: పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా. దైవదర్శనాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఇబ్బంది కలిగిస్తాయి.
ధనుస్సు: సన్నిహితుల నుంచి మాటసాయం. ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.
మకరం: రాబడికి మించి ఖర్చులు. బంధువుల తాకిడి పెరుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. ప్రయాణాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.
కుంభం: వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.
మీనం: కార్యజయం. ఆస్తిలాభం. ప్రముఖులతో పరిచయాలు. ఆత్మీయులతో సఖ్యత. వివాహయత్నాలు సానుకూలం. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో పురోభివృద్ధి.
Comments
Please login to add a commentAdd a comment