Horoscope: ఈ రాశివారు చేపట్టిన పనులలో విజయం | Daily Horoscope Sept 04 2024 Telugu Rasi Phalalu Today | Sakshi
Sakshi News home page

Horoscope: ఈ రాశివారు చేపట్టిన పనులలో విజయం

Published Wed, Sep 4 2024 6:57 AM | Last Updated on Wed, Sep 4 2024 8:55 AM

Daily Horoscope Sept 04 2024 Telugu Rasi Phalalu Today

శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, తిథి: శు.పాడ్యమి ఉ.7.56 వరకు, తదుపరి విదియ, నక్షత్రం: ఉత్తర తె.5.19 వరకు (తెల్లవారితే గురువారం), తదుపరి హస్త, వర్జ్యం: ఉ.10.47 నుండి 12.31 వరకు, దుర్ముహూర్తం: ఉ.11.36 నుండి 12.24 వరకు, అమృత ఘడియలు: రా.9.20 నుండి 11.06 వరకు; రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు, యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు, సూర్యోదయం: 5.49, సూర్యాస్తమయం: 6.10. 

మేషం: వ్యవహారాలలో విజయం. పరిచయాలు పెరుగుతాయి. ఆకస్మిక ధనలాభం. యత్నకార్యసిద్ధి. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు.

వృషభం: పనుల్లో ఆటంకాలు. దూరప్రయాణాలు. ఒప్పందాలు రద్దు. ఆస్తి వివాదాలు.మానసిక అశాంతి. ధనవ్యయం. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో నిరుత్సాహం.

మిథునం: అప్పులు చేయాల్సివస్తుంది. దూరప్రయాణాలు. బంధువులతో తగాదాలు.వ్యయప్రయాసలు. ఆరోగ్యసమస్యలు. పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో చికాకులు. 

కర్కాటకం: మిత్రులతో  విభేదాలు. కుటుంబంలో చికాకులు. దూరప్రయాణాలు. ఆరోగ్యసమస్యలు. పనులు ముందుకు సాగవు. వ్యాపారాలు కొంత నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో పనిభారం.

సింహం: మిత్రులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు.కొత్తగా అప్పులు చేస్తారు. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపారాలు అంతగా అనుకూలించవు. ఉద్యోగాలలో ఆటుపోట్లు. పనులు మధ్యలో విరమిస్తారు.

కన్య: చేపట్టిన పనులలో విజయం. శుభవర్తమానాలు. ఆదాయం పెరుగుతుంది.పోటీపరీక్షల్లో అనుకూల ఫలితాలు. సోదరుల కలయిక. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం.

తుల: ఆశ్చర్యకరమైన సంఘటనలు. పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం. ఆస్తిలాభం. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి. వాహనయోగం.

వృశ్చికం: ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో ఆదరణ. సోదరులతో సఖ్యత. వ్యాపారాలలో పురోగతి. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి. కొత్త ఉద్యోగ లాభం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. 

ధనుస్సు: సోదరులతో విభేదాలు. ముఖ్యమైన కార్యక్రమాలు రద్దు. ఆరోగ్యభంగం. దూరప్రయాణాలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో కొద్దిపాటి చిక్కులు. దైవదర్శనాలు.

మకరం: ఆదాయం పెరుగుతుంది. సన్నిహితుల నుంచి శుభవర్తమానాలు. ఆస్తి వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో ఉత్సాహం.

కుంభం: కీలక వ్యవహారాలలో విజయం. నూతన విద్యావకాశాలు. ఆకస్మిక ప్రయాణాలు. దైవచింతన. వ్యాపారాలలో ముందడుగు. ఉద్యోగాలలో సత్తా చాటుకుంటారు.

మీనం: బంధువర్గంతో తగాదాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిళ్లు. నిరుద్యోగుల కృషి ఫలించదు. పనులలో అవరోధాలు. ఆరోగ్య, కుటుంబసమస్యలు. ఆస్తి వివాదాలు.

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement