శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, తిథి: శు.త్రయోదశి ప.1.12 వరకు, తదుపరి చతుర్దశి, నక్షత్రం: ధనిష్ఠ ప.3.52 వరకు, తదుపరి శతభిషం,
వర్జ్యం: రా.10.40 నుండి 12.10 వరకు,
దుర్ముహూర్తం: ప.12.21 నుండి 1.10 వరకు, తదుపరి ప.2.45 నుండి 3.36 వరకు,
అమృతఘడియలు: ఉ.5.57 నుండి 7.28 వరకు;
రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు,
యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు,
సూర్యోదయం: 5.50,
సూర్యాస్తమయం: 6.02.
👉: మేషం... ఆకస్మిక ధనలబ్ధి. కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. పరిచయాలు మరింత పెరుగుతాయి. వ్యవహారాలలో విజయం. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో పురోభివృద్ధి.
👉: వృషభం.. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. వాహనయోగం. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు.
👉: మిథునం... మిత్రులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలలో స్వల్ప అవాంతరాలు. ఆరోగ్యభంగం. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.
👉: కర్కాటకం.. కొద్దిపాటి చికాకులు ఎదుర్కొంటారు. అనుకున్న పనుల్లో అవాంతరాలు. రుణయత్నాలు. ప్రయాణాలు వాయిదా. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో మార్పులు.
👉: సింహం... సన్నిహితుల నుంచి ధనలబ్ధి. పరిచయాలు పెరుగుతాయి. ఆస్తి వివాదాలు పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యవహారాలలో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.
👉: కన్య... చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. భూములు, వాహనాలు కొంటారు. ధనలబ్ధి. కొత్త పనులు చేపడతారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.
👉: తుల.. వ్యవహారాలలో అవాంతరాలు. ప్రయాణాలు వాయిదా. శ్రమాధిక్యం. సోదరుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు కొంత అనుకూలం. ఉద్యోగాలలో మార్పులు.
👉: వృశ్చికం... బంధువులను కలుసుకుంటారు. కొన్ని పనులు వాయిదా వేస్తారు. అనారోగ్యం. దూరప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత గందరగోళం.
👉: ధనుస్సు... శ్రమ ఫలిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు పరిష్కారం. వేడుకల్లో పాల్గొంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ప్రోత్సాహం.
👉: మకరం... కుటుంబంలో ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. కొన్ని పనులు మందగిస్తాయి. నిర్ణయాలు మార్పుచుకుంటారు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత నిరుత్సాహం.
👉: కుంభం... కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. వాహనయోగం. ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.
👉: మీనం... కొన్ని వ్యవహారాలు మందగిస్తాయి. శ్రమాధిక్యం. ఉద్యోగయత్నాలు ముందుకు సాగవు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత నిరుత్సాహం. అనారోగ్యం.
Comments
Please login to add a commentAdd a comment