గ్రహం అనుగ్రహం
శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం, తిథి: శు.విదియ ఉ.9.53 వరకు, తదుపరి తదియ, నక్షత్రం: హస్త పూర్తి (24 గంటలు), వర్జ్యం: ప.2.40 నుండి 4.24 వరకు, దుర్ముహూర్తం: ఉ.9.56 నుండి 10.44 వరకు, తదుపరి ప.2.53 నుండి 3.41 వరకు,అమృత ఘడియలు: రా.1.14 నుండి 3.01 వరకు.
మేషం...ఉద్యోగయత్నాలు సానుకూలం. కొత్త విషయాలు తెలుసుకుంటారు. బంధువుల కలయిక. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి. వస్తులాభాలు.
వృషభం...రుణదాతల ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. పనులు ముందుకు సాగవు. ఆరోగ్యభంగం. కష్టమే తప్ప ఫలితం ఉండదు. మిత్రుల నుంచి సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సామాన్యస్థితి.
మిథునం...శ్రమ మరింత తప్పదు. పనుల్లో అవాంతరాలు. బంధువులతో తగాదాలు. ఆరోగ్యసమస్యలు. కుటుంబంలో ఒత్తిడులు. ప్రయాణాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితి.
కర్కాటకం...నూతనవిద్యావకాశాలు. ప్రముఖులతో పరిచయాలు. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుంటారు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రగతి ఉంటుంది.
సింహం....ఆర్థిక లావాదేవీలలో ఆటుపోట్లు. అనుకోని ప్రయాణాలు. కుటుంబసభ్యులతో తగాదాలు. పనులు ముందుకు సాగవు. వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాలలో చిక్కులు.
కన్య....కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు అందుతాయి. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన. ఆస్తి లాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.
తుల....ఆకస్మిక ప్రయాణాలు. పనుల్లో అవాంతరాలు. కొత్త రుణాల కోసం యత్నాలు. మిత్రులతో విభేదాలు. ఆలయాలు సందర్శిస్తారు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.
వృశ్చికం..కొత్త మిత్రుల పరిచయం. శుభవార్తలు. వాహనయోగం. భూవివాదాలు పరిష్కారం. వాహనసౌఖ్యం. నూతన ఉద్యోగయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరం.
ధనుస్సు....కొత్త పనులకు శ్రీకారం. శుభవార్తలు అందుతాయి. బంధుమిత్రులతో సఖ్యత. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. భూములు,వాహనాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.
మకరం...కొన్ని వ్యవహారాలు ముందుకు సాగవు. ప్రయాణాలు వాయిదా. శ్రమ తప్పదు. ఆర్థిక ఇబ్బందులు. నిరుద్యోగుల ప్రయత్నాలు మందగిస్తాయి. వృత్తి,వ్యాపారాలలో ఒత్తిడులు పెరుగుతాయి.
కుంభం.....మిత్రులతో అకారణంగా తగాదాలు. ఎంత కష్టించినా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. పనులు కొన్ని వాయిదా పడతాయి. దైవదర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.
మీనం...అతికీలక విషయాలలో ముందడుగు వేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పరిచయాలు పెరుగుతాయి. సంఘంలో గౌరవం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.
Comments
Please login to add a commentAdd a comment