ఈ రాశి వారికి అన్ని పనుల్లో విజయం, బాకీలు వసూలు | Today Telugu Horoscope On March 3rd, 2024: Know Astrological Predictions Of Your Zodiac Signs In Telugu - Sakshi
Sakshi News home page

Today Telugu Horoscope: ఈ రాశి వారికి అన్ని పనుల్లో విజయం, బాకీలు వసూలు

Mar 3 2024 7:04 AM | Updated on Mar 3 2024 11:14 AM

Daily Horoscope In Telugu 03 03 2024 - Sakshi

శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు మాఘ మాసం, తిథి: బ.అష్టమి రా.3.33 వరకు తదుపరి నవమి, నక్షత్రం: అనూరాధ ఉ.11.17 వరకు తదుపరి జ్యేష్ఠ, వర్జ్యం: సా.4.58 నుండి 6.34 వరకు, దుర్ముహూర్తం: సా.4.33 నుండి 5.21 వరకు, అమృతఘడియలు: రా.2.40 నుండి 3.44 వరకు.

సూర్యోదయం        :  6.21
సూర్యాస్తమయం    :  6.03
రాహుకాలం :  సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం : ప.12.00 నుంచి 1.30 వరకు

 

మేషం: వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు. ధనవ్యయం. ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. శ్రమ పెరుగుతుంది. మిత్రులతో వివాదాలు. వ్యాపార, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి. 

వృషభం: పనుల్లో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రుల కలయిక. బాకీలు వసూలవుతాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. 

మిథునం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఇంటాబయటా ప్రోత్సాహం. ఆస్తి విషయంలో అగ్రిమెంట్లు. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి. 

కర్కాటకం: మిత్రులతో విభేదాలు. అనుకోని ధనవ్యయం. కుటుంబంలో ఒత్తిడులు. పనుల్లో జాప్యం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సొమ్ము అందక ఇబ్బందులు. వృత్తి,వ్యాపారాలు సామాన్యం. 

సింహం: శ్రమాధిక్యం. పనులలో తొందరపాటు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. రుణయత్నాలు. అనారోగ్య సూచనలు. వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి మార్పులు. విద్యార్థులకు ఒత్తిడులు. 

కన్య: మిత్రుల సహకారం అందుతుంది. ఆకస్మిక ధనలాభం. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవమర్యాదలు. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. 

తుల: పనుల్లో కొద్దిపాటి ఆటంకాలు. ధనవ్యయం. శ్రమ పడ్డా ఫలితం ఉండదు. బంధువులతో విభేదాలు. ఆలోచనలు కలసిరావు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. దైవదర్శనాలు. 

వృశ్చికం: శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలం. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి కనిపిస్తుంది. 

ధనుస్సు: బంధువుల నుంచి ఒత్తిడులు. పనులు కొన్ని వాయిదా వేస్తారు. ఇంటాబయటా చికాకులు. ఆరోగ్యభంగం. శ్రమ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఆస్తి వివాదాలు. 

మకరం: నిరుద్యోగుల ఆశలు నెరవేరతాయి. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో పురోగతి. ఇంటిలో శుభకార్యాలు. వస్తులాభాలు. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. 

కుంభం: ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవమర్యాదలు. ఆర్థిక ప్రగతి. రుణఒత్తిడులు తొలగుతాయి. వస్తులాభాలు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. 

మీనం: ఉద్యోగ యత్నాలు నత్తనడకన సాగుతాయి. పనులు వాయిదా వేస్తారు. బంధువులు, మిత్రులతో మాటపట్టింపులు. బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహం. దైవదర్శనాలు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement