శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘ మాసం, తిథి: బ.నవమి రా.2.55 వరకు, తదుపరి దశమి, నక్షత్రం: జ్యేష్ఠ ఉ.11.34 వరకు, తదుపరి మూల, వర్జ్యం: రా.7.32 నుండి 9.02 వరకు, దుర్ముహూర్తం: ప.12.36 నుండి 1.24 వరకు, తదుపరి ప.2.58 నుండి 3.46 వరకు, అమృతఘడియలు: తె.5.03 నుండి 7.43 వరకు (తెల్లవారితే మంగళవారం), అమృతఘడియలు: సా.6.54 నుండి 8.40 వరకు; రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు, యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు, సూర్యోదయం: 6.21, సూర్యాస్తమయం: 6.03.
రాశి ఫలాల:
మేషం: పనుల్లో అవాంతరాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. బంధువులతో తగాదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.
వృషభం: బంధువులతో సత్సంబంధాలు. ఆర్థిక పరిస్థితి మెరుకుపడుతుంది. విచిత్ర సంఘటనలు. వస్తులాభాలు. ఉద్యోగప్రాప్తి. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.
మిథునం: కొత్త వ్యక్తుల పరిచయం. ఆసక్తికర సమాచారం. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి.
కర్కాటకం: పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. కొత్త రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి. దైవదర్శనాలు.
సింహం: బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా సాగవు. పనుల్లో అవాంతరాలు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.
కన్య: నూతన కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు వింటారు ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.
తుల: నిర్ణయాలు మార్పుచుకుంటారు. పనులు ముందుకు సాగవు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.
వృశ్చికం: పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. సంఘంలో ఆదరణ. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత ఉత్సాహాన్నిస్తాయి.
ధనుస్సు: కుటుంబంలో చికాకులు. అనుకోని ధనవ్యయం. శ్రమాధిక్యం. పనుల్లో కొంత జాప్యం. ఆలయ దర్శనాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా మారవచ్చు.
మకరం: కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మరింత అనుకూలిస్తుంది. యత్నకార్యసిద్ధి. కొన్ని పనులు సమయానికి పూర్తి చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు.
కుంభం: సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. ముఖ్య కార్యక్రమాలలో విజయం. పరపతి పెరుగుతుంది. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీదే పైచేయిగా ఉంటుంది.
మీనం: సన్నిహితులతో విభేదాలు. ఆర్థిక పరిస్థితి నిరాశ పరుస్తుంది. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి.


