Rasi Phalalu: ఈ రాశివారికి పనుల్లో విజయం.. ఆప్తుల నుంచి శుభవార్తలు | Daily Horoscope Today Telugu: Sep 2 Rasi Phalalu | Sakshi
Sakshi News home page

సెప్టెంబర్‌ 2 దినఫలం: ఈ రాశివారికి పనుల్లో విజయం.. ఆప్తుల నుంచి శుభవార్తలు

Published Mon, Sep 2 2024 6:36 AM | Last Updated on Mon, Sep 2 2024 9:23 AM

Daily Horoscope Today Telugu: Sep 2 Rasi Phalalu

గ్రహఫలం..సోమవారం, 02.09.24 
సూర్యోదయం: 5.48, 
సూర్యాస్తమయం: 6.12. 

శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, 
తిథి: అమావాస్య పూర్తి (24 గంటలు), 
నక్షత్రం: మఖ రా.12.32 వరకు, తదుపరి పుబ్బ, 

వర్జ్యం: ఉ.11.38 నుండి 1.18 వరకు, 
దుర్ముహూర్తం: ప.12.26 నుండి 1.14 వరకు, తదుపరి ప.2.55 నుండి 3.43 వరకు, 

పోలాల అమావాస్య; రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు, 
యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు, 

అమృతఘడియలు: రా.10.01 నుండి 11.42 వరకు, 

మేషం: ఆర్థిక విషయాలు గందరగోళంగా ఉంటాయి. సన్నిహితుల నుండి మాటపడతారు. ఆకస్మిక ప్రయాణాలు. కొన్ని వివాదాలతో సతమతం కాగలరు. వృత్తులు, వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి.

వృషభం: సన్నిహితుల నుండి ఒత్తిడులు. పనుల్లో ఆలస్యం. ప్రయాణాలలో మార్పులు. ఆదాయానికి మించి ఖర్చులు. బాధ్యతలు పెరుగుతాయి. వృత్తులు, వ్యాపారాలు ఇబ్బందిగా మారవచ్చు.

మిథునం: ఆప్తుల సలహాల మేరకు నిర్ణయాలు తీసుకుంటారు. ఆదాయానికి ఇబ్బంది రాదు. ఉద్యోగాన్వేషణ ఫలిస్తుంది. కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. వృత్తులు, వ్యాపారాలలో మరింత చురుగ్గా వ్యవహరిస్తారు.

కర్కాటకం: వ్యయప్రయాసలు తప్పవు. ఆర్థికంగా గందరగోళం.మిత్రులే వ్యతిరేకులుగా మారవచ్చు. దూరప్రయాణాలు. వృత్తులు, వ్యాపారాలలో కొద్దిపాటి సమస్యలు.

సింహం: వీరికి అన్ని విధాలా సానుకూలం. పనులలో ప్రతిబంధకాలు తొలగుతాయి. ఆప్తులు, శ్రేయోభిలాషుల నుండి ముఖ్య సమచారం. విందువినోదాలు. వృత్తులు, వ్యాపారాలను సమర్థవంతంగా నిర్వహిస్తారు.

కన్య: ఆకస్మిక ప్రయాణాలు. ఆస్తుల ఒప్పందాలలో మార్పులు. ఆరోగ్య సమస్యలు. కుటుంబంలో ఒత్తిడులు. దైవదర్శనాలు. వృత్తులు, వ్యాపారాలు మందగిస్తాయి.

తుల: ఉత్సాహంగా వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఆత్మీయుల సలహాలు పొందుతారు. చాకచక్యంగా వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది.

వృశ్చికం: శ్రమకు తగిన ఫలితం పొందుతారు. ఆత్మీయుల ఆదరణ లభిస్తుంది. ఆస్తుల వ్యవహారాలు కొలిక్కి తెచ్చుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తులు, వ్యాపారాలలో చిక్కులు వీడతాయి.

ధనుస్సు: బంధువులతో విభేదాలు రావచ్చు. ప్రయాణాలు ఆటంకాలతో సాగుతాయి. ముఖ్య వ్యవహారాలలో ప్రతిబంధకాలు. రుణయత్నాలు. వృత్తులు, వ్యాపారాలు సామాన్యంగా కొనసాగుతాయి..

మకరం: వ్యవహారాలు ముందుకు సాగవు. కొన్ని ప్రయాణాలు వాయిదా. కొన్ని వివాదాలలో చిక్కుకుంటారు. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. వృత్తులు, వ్యాపారాలు కొంత మందకొడిగా సాగుతాయి.

కుంభం: పనుల్లో విజయం. ఆప్తుల నుండి శుభవార్తలు. ఆర్థికంగా కొంత వెసులుబాటు. ఇంటాబయటా ప్రోత్సాహం. వృత్తులు, వ్యాపారాలు మరింత వేగవంతంగా కాగలవు.

మీనం: సన్నిహితులతో సఖ్యత. మీ ఉద్యోగయత్నాలు వేగవంతం కాగలవు. ఆర్థికాభివృద్ధి. ముఖ్య చర్చలు సఫలం. వృత్తులు, వ్యాపారాలు చురుగ్గా నిర్వహిస్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement