శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, నిజ శ్రావణ మాసం , తిథి: శు.విదియ సా.5.46 వరకు, తదుపరి తదియ, నక్షత్రం: పుబ్బ రా.9.58 వరకు, తదుపరి ఉత్తర, వర్జ్యం: తె.5.50 నుండి 7.34 వరకు (తెల్లవారితే శనివారం), దుర్ముహూర్తం: ఉ.8.15 నుండి 9.06 వరకు, తదుపరి ప.12.27 నుండి 1.18 వరకు, అమృతఘడియలు: ప.2.54 నుండి 4.40 వరకు, శుక్ర మూఢమి త్యాగం.
సూర్యోదయం : 5.46
సూర్యాస్తమయం : 6.21
రాహుకాలం : ఉ.10.30
నుండి 12.00 వరకు
యమగండం : ప.3.00 నుండి 4.30 వరకు
మేషం: వ్యయప్రయాసలు. రాబడికి కన్నా ఖర్చులు అ«ధికం. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు అంతగా లాభించవు. ఉద్యోగులకు మార్పులు.
వృషభం: కుటుంబసభ్యులతో విభేదాలు. అనుకోని ఖర్చులు. పనులు మధ్యలో విరమిస్తారు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.
మిథునం: శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.
కర్కాటకం: పనుల్లో ఆవాంతరాలు. రుణాలు చేస్తారు. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. మానసిక అశాంతి. శ్రమ తప్ప ఫలితం ఉండదు. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.
సింహం: వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. ఆర్థికవృద్ధి. కీలక నిర్ణయాలు. ఆస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.
కన్య: ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. పనుల్లో ప్రతిబంధకాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు.
తుల: దూరపు బంధువుల కలయిక. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు.
వృశ్చికం: ఇంటర్వ్యూలకు హాజరవుతారు. ముఖ్య వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు అనుకోని హోదాలు.
ధనుస్సు: మిత్రులు, బం«ధువుల నుంచి ఒత్తిడులు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. పనులు వాయిదా. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు.
మకరం: పనులు వాయిదా వేస్తారు. శ్రమా«ధిక్యం. బంధువులతో తగాదాలు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఇబ్బందులు.
కుంభం: ఆకస్మిక ధనలాభం. పరపతి పెరుగుతుంది. పోటీపరీక్షల్లో విజయం. ఆసక్తికర సమాచారం. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.
మీనం: నిరుద్యోగులకు సంతోషకరమైన వార్తలు. పనులు సకాలంలో పూర్తి. సంఘంలో గౌరవం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
Comments
Please login to add a commentAdd a comment