శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, అధిక శ్రావణ మాసం, తిథి: శు.అష్టమి ఉ.10.25 వరకు తదుపరి నవమి, నక్షత్రం: స్వాతి రా.8.55 వరకు తదుపరి విశాఖ, వర్జ్యం: రా.2.36 నుండి 4.15 వరకు, దుర్ముహూర్తం: ప.11.41 నుండి 12.30 వరకు, అమృతఘడియలు: ఉ.11.50 నుండి 1.29 వరకు.
సూర్యోదయం : 5.40
సూర్యాస్తమయం : 6.32
రాహుకాలం : ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం : ఉ.7.30 నుండి 9.00 వరకు
మేషం: పలుకుబడి పెరుగుతుంది. వస్తులాభాలు. ఉద్యోగయత్నాలు సానుకూలం. శుభవార్తలు. సోదరుల నుంచి ధనలాభం. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి.
వృషభం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. శుభవార్తలు. విందువినోదాలు. ప్రముఖులతో పరిచయాలు. వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆస్తిలాభం.
మిథునం: బంధువులతో వివాదాలు. ధనవ్యయం. శ్రమాధిక్యం. ఆరోగ్యభంగం. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపార, ఉద్యోగాలలో అనుకోని మార్పులు. కళాకారులకు కొంత నిరుత్సాహం.
కర్కాటకం: ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. ధనవ్యయం. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. మానసిక ఆందోళన. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు.
సింహం: నూతన పరిచయాలు. సంఘంలో ఆదరణ. ఇంటర్వ్యూలు అందుతాయి. కొన్ని వివాదాలు తీరతాయి. సోదరుల నుంచి శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.
కన్య: కొన్ని కార్యక్రమాలు వాయిదా. శ్రమ పెరుగుతుంది. సన్నిహితులతో వివాదాలు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో అనుకోని మార్పులు. ఇంటాబయటా ఒత్తిడులు.
తుల: ఆర్థిక లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. భూ,గృహయోగాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. పరిచయాలు విస్తృతమవుతాయి. ఆహ్వానాలు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి.
వృశ్చికం: పనుల్లో జాప్యం. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహం. బంధువులతో స్వల్ప వివాదాలు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి,వ్యాపారాలలో ఒత్తిడులు. అనారోగ్యం.
ధనుస్సు: వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగవర్గాలకు నూతనోత్సాహం. పనుల్లో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. ఆకస్మిక ధన, వస్తులాభాలు. ప్రముఖులతో పరిచయాలు.
మకరం: ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలలో పురోగతి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. విందువినోదాలు. దూరపు బంధువుల కలయిక. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.
కుంభం: మిత్రులతో స్వల్ప వివాదాలు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.
మీనం: రుణయత్నాలు. పనుల్లో జాప్యం. బంధువులు, మిత్రులతో వివాదాలు. ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.
Comments
Please login to add a commentAdd a comment