శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, తిథి: బ.చతుర్దశి రా.8.46 వరకు, తదుపరి అమావాస్య, నక్షత్రం: పుబ్బ ఉ.9.56 వరకు, తదుపరి ఉత్తర, వర్జ్యం: సా.5.54 నుండి 7.38 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.17 నుండి 9.05 వరకు, తదుపరి రా.10.40 నుండి 11.28 వరకు, అమృతఘడియలు: తె.4.26 నుండి ఉ.6.11 వరకు (తెల్లవారితే బుధవారం).
మేషం: రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ.
వృషభం: మిత్రులతో కలహాలు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. పనుల్లో ఆటంకాలు. దైవచింతన. వ్యాపారాల విస్తరణ వాయిదా. ఉద్యోగాలలో మరిన్ని చికాకులు.
మిథునం: ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. వాహనయోగం. పనుల్లో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.
కర్కాటకం: వ్యయప్రయాసలు. బంధువులు, మిత్రులతో విభేదాలు. అనుకోని ప్రయాణాలు. పనుల్లో అవాంతరాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.
సింహం: కుటుంబసభ్యుల ప్రశంసలు. ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు. వాహనయోగం. పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.
కన్య: శ్రమపడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. బంధువుల నుంచి ఒత్తిడులు. వ్యవహారాలు మందగిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.
తుల: సంఘంలో విశేష గౌరవమర్యాదలు. ఆలోచనలు కలసివస్తాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. వస్తు, వస్త్రలాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.
వృశ్చికం: కొత్త పనులు చేపడతారు. ఆత్మీయుల నుంచి ముఖ్య సమాచారం. స్థిరాస్తి వృద్ధి. ఆహ్వానాలు రాగలవు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఎదురులేని పరిస్థితి.
ధనుస్సు: ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. పనుల్లో అవాంతరాలు. బంధువర్గంతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.
మకరం: ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. ఒప్పందాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిళ్లు.
కుంభం: పనుల్లో అవాంతరాలు తొలగుతాయి. ఆహ్వానాలు అందుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. నూతన పరిచయాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీదే పైచేయిగా ఉంటుంది.
మీనం: కొన్ని వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆహ్వానాలు అందుతాయి. కాంట్రాక్టులు పొందుతారు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.
Comments
Please login to add a commentAdd a comment