ఏప్రిల్ 30వ తేదీ సూర్య గ్రహణం ఏర్పడనుంది. ఈ ఏడాది ఇదే తొలి సూర్యగ్రహణం. ఈ సూర్యగ్రహణం వచ్చే రోజు అమవాస్యతో పాటు శనివారం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. హిందూ శాస్త్రాల ప్రకారం గ్రహణాలను అశుభంగా పరిగణిస్తారు.
వైశాఖ మాసం కృష్ణ పక్షపు అమావాస్య రోజు నాడు సూర్యగ్రహణం ఏర్పడటం అరుదుగా సంభవిస్తుంటుందని పండితులు చెబుతున్నారు. దీని ప్రభావం కొన్ని రాశులపై ఉంటుందని సూచిస్తోన్నారు. సూర్యగ్రహణం, అమావాస్య, శనివారానికి చాలా ప్రాధాన్యత ఉంది. కొన్ని చోట్ల అమావాస్య రోజున పాలు కూడా కొనరు. శనివారం నాడు వంటనూనెకు సంబంధించిన వస్తువులు తీసుకోరు. ఇప్పుడు శనివారం, అమవాస్యకు తోడు సూర్యగ్రహణం రాబోతుంది.
భారత్‌లో సూర్యగ్రహణం కనిపించదు?
భారత్‌లో ఈ సూర్యగ్రహణం కనిపించదు. అమెరికా దక్షిణ ప్రాంతం, అంటార్కిటికా, దక్షిణ పసిఫిక్ సముద్ర తీర ప్రాంత దేశాల ప్రజలు మాత్రమే ఈ పాక్షిక సూర్యగ్రహణాన్ని వీక్షించగలరు. చిలీ, అర్జెంటీనా, ఉరుగ్వే, పరాగ్వే పశ్చిమ ప్రాంతం, బొలీవియ నైరుతి ప్రాంతం, పెరూ ఈశాన్య ప్రాంతం, బ్రెజిల్ ఆగ్రేయ ప్రాంత ప్రజలు మాత్రమే దీన్ని చూడగలరని నాసా తెలిపింది.
భారత్‌లో ఈ సూర్య గ్రహణం అర్ధరాత్రి ఆరంభమౌతుంది. సుమారు నాలుగు గంటల పాటు కొనసాగుతుంది. తెల్లవారు జామున 4:07 నిమిషాలకు ముగుస్తుంది. అంటే భారత్‌లో ప్రజలు దీన్ని వీక్షించే అవకాశం లేదు. ఫలితంగా భారత్‌లో సూర్యగ్రహణ ప్రభావం దాదాపు ఉండదు.
గ్రహణాలు ఏర్పడేటప్పుడు కొన్ని రాశులపై వాటి ప్రభావం ఉంటుంది. ఇది పాక్షిక సూర్యగ్రహణమే అయినప్పటికీ కొన్ని రాశులపై ప్రభావం ఉండే అవకాశం ఉంది. ఈ సూర్య గ్రహణం ప్రభావం మేష రాశిపై అధికంగా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం రవి మేష రాశిలో ఉండటం ఏప్రిల్ 30వ తేదీన చంద్రుడు మేషంలోకి రావడంతో ఈ రాశి వారిపై గ్రహణం ప్రభావం ఉండే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment