
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం; తిథి: శు.సప్తమి ప.1.15 వరకు, తదుపరి అష్టమి; నక్షత్రం: ఉత్తర ప.1.04 వరకు, తదుపరి హస్త; వర్జ్యం: రా.10.13 నుండి 11.57 వరకు; దుర్ముహూర్తం: ఉ.11.39 నుండి 12.31 వరకు; అమృత ఘడియలు: లేవు; రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు; యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు; సూర్యోదయం: 5.32, సూర్యాస్తమయం: 6.34
మేషం.... పనులు సజావుగా సాగుతాయి. ఆప్తులు దగ్గరవుతారు. ప్రముఖులతో పరిచయాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో కొత్త ఆశలు.
వృషభం.... పనిభారం. దూరప్రయాణాలు. మిత్రులతో అకారణంగా విభేదాలు. కష్టానికి ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. వ్యాపారాలు నిరాశాజనకం. ఉద్యోగాలలో సమస్యలు. అనారోగ్యం.
మిథునం... కొత్తగా రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసమస్యలు. స్వల్ప అనారోగ్యం. మిత్రులతో విభేదాలు. వ్యాపారాలు మందకొడిగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో అదనపు పనిభారం.
కర్కాటకం.... శుభవర్తమానాలు. అందరిలోనూ గుర్తింపు. పలుకుబడి పెరుగుతుంది. వస్తులాభాలు. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలలో ఉత్సాహంగా సాగుతారు. ఉద్యోగాలలో అనుకూలత.
సింహం.... బంధువులతో విభేదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబ, ఆరోగ్యసమస్యలు. ప్రయాణాలు వాయిదా. ముఖ్యమైన పనుల్లో అవాంతరాలు. వ్యాపారాలలో కొన్ని చిక్కులు. ఉద్యోగాలలో స్వల్ప మార్పులు.
కన్య.... బంధువులతో సఖ్యత. యత్నకార్యసిద్ధి. ప్రముఖులతో పరిచయాలు. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వ్యాపారాలు కొంత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో గందరగోళం తొలగుతుంది.
తుల... ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ప్రయాణాలలో మార్పులు. ఆధ్యాత్మిక చింతన. బంధువులతో అకారణంగా విభేదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారులు, ఉద్యోగులకు ఒత్తిళ్లు.
వృశ్చికం.. కార్యజయం. ఆస్తిలాభం. ఆదాయం మరింత పెరుగుతుంది. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో కొత్త పోస్టులు. దైవదర్శనాలు.
ధనుస్సు.... పరపతి పెరుగుతుంది. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వాహనయోగం. చర్చల్లో పురోగతి. వ్యాపారాలలో పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో ఆటంకాలు తొలగుతాయి.
మకరం...... పనుల్లో కొద్దిపాటి ఆటంకాలు. ప్రయాణాలు వాయిదా. బంధువులు, మిత్రులతో విభేదాలు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో పని ఒత్తిడులు.
కుంభం..... రాబడికి మించి ఖర్చులు. అనుకోని ప్రయాణాలు. బంధువులతో విభేదాలు. అనారోగ్య సూచనలు. వ్యాపారాలలో నిదానం పాటించాలి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు.
మీనం... కొత్త విషయాలు తెలుస్తాయి. విద్యార్థులకు ఫలితాలు ఊరటనిస్తాయి. బాకీలు వసూలవుతాయి. వస్తులాభాలు. వ్యాపారాలలో అధిక లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.