
గ్రహం అనుగ్రహం: శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘ మాసం, తిథి: శు.త్రయోదశి రా.7.20 వరకు, తదుపరి చతుర్దశి,నక్షత్రం: పునర్వసు సా.6.40 వరకు, తదుపరి పుష్యమి, వర్జ్యం: ఉ.6.49 నుండి 8.21 వరకు, తదుపరి రా.2.46 నుండి 4.22 వరకు, దుర్ముహూర్తం: ప.12.40 నుండి 1.28 వరకు, తదుపరి ప.2.57 నుండి 3.45 వరకు, అమృతఘడియలు: సా.4.20 నుండి 5.55 వరకు.
సూర్యోదయం : 6.34
సూర్యాస్తమయం : 5.55
రాహుకాలం : ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం : ఉ.10.30 నుండి 12.00 వరకు
మేషం... సన్నిహితులతో స్వల్ప వివాదాలు. ఆలోచనలు పరిపరివిధాలుగా ఉంటాయి. ఆకస్మిక ప్రయాణాలు. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత అనుకూలత. ధనవ్యయం.
వృషభం.... ఆప్తుల సూచనలు, సలహాలు స్వీకరిస్తారు. అనుకున్న పనులు చక్కదిద్దడంలో ఆటంకాలు తొలగుతాయి. మీ సత్తా అందరూ గుర్తిస్తారు. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అవాంతరాలు అధిగమిస్తారు.
మిథునం... చేపట్టిన పనులు కొంత నెమ్మదిగా సాగుతాయి. ధనవ్యయం. స్థిరాస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. స్వల్ప అనారోగ్యం.. వ్యాపారాలు, ఉద్యోగాలు చికాకు పరుస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు..
కర్కాటకం... ప్రముఖులతో పరిచయాలు. సమాజసేవలో పాల్గొంటారు. పాతబాకీలు కొన్ని వసూలవుతాయి. బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత ముందడుగు వేస్తారు.
సింహం...... దూరప్రయాణాలు. ఇంటాబయటా కొన్ని సమస్యలు. ధనవ్యయం. స్వల్ప అనారోగ్యం.. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఊరటనిస్తాయి. పారిశ్రామికవేత్తలకు ఆహ్వానాలు.
కన్య... వివాదాల నుంచి గట్టెక్కుతారు. ఆదాయం సంతృప్తినిస్తుంది. నూతన ఉద్యోగాలు పొందుతారు. దైవదర్శనాలు. వ్యతిరేకులు అనుకూలురుగా మారతారు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.
తుల..... దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఉద్యోగ ప్రయత్నాలు కలసివస్తాయి. దైవదర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.
వృశ్చికం... పనులు మందగిస్తాయి. శ్రమాధిక్యం. దూరప్రయాణాలు. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
ధనుస్సు.... ధనవ్యయం. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. ఆరోగ్యభంగం. శ్రమకు ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ప్రయాణాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం. ఆలయ దర్శనాలు.
మకరం.... పరిచయాలు విస్త్తృతమవుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. విద్యార్థులకు కొత్త అవకాశాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.
కుంభం... శుభవార్తలు వింటారు. ఆస్తిలాభం. ప్రముఖులతో పరిచయాలు. అందరిలోనూ గుర్తింపు. చిత్రమైన సంఘటనలు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఇబ్బందులను అధిగమిస్తారు.
మీనం..... శ్రమకు ఫలితం కనిపించదు. ఆస్తి తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువులతో విభేదిస్తారు. ప్రయాణాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు..
Comments
Please login to add a commentAdd a comment