ఈ రాశివారు శుభవార్తలు వింటారు.. రాబడి ఆశాజనకం | Sakshi
Sakshi News home page

దినఫలం: ఈ రాశివారు శుభవార్తలు వింటారు.. రాబడి ఆశాజనకం

Published Wed, Mar 20 2024 7:05 AM

Today Astrology Daily Horoscope Rasi Phalalu March 20 2024 Telugu - Sakshi

శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం,
తిథి: శు.ఏకాదశి రా.3.57 వరకు, తదుపరి ద్వాదశి,
నక్షత్రం: పుష్యమి రా.12.33 వరకు, తదుపరి ఆశ్లేష,

సూర్యోదయం: 6.09, సూర్యాస్తమయం: 6.06. 

వర్జ్యం: ఉ.7.20 నుండి 9.01 వరకు,
దుర్ముహూర్తం: ఉ.11.43 నుండి 12.31 వరకు,
రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు,
యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు,

అమృత ఘడియలు: సా.4.40 నుండి 7.22 వరకు;

మేషం: ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేయాల్సివస్తుంది. బంధు,మిత్రులతో విరోధాలు. వ్యాపార లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాల్లో చికాకులు పెరుగుతాయి. కొన్ని పనులు వాయిదా వేస్తారు. దైవదర్శనాలు.

వృషభం: ఇంటాబయటా ప్రోత్సాహం. ఆకస్మిక ధనలాభం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఉన్నత హోదాలు. విందువినోదాలు. పనులు చకచకా పూర్తి చేస్తారు. అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. వాహనయోగం..

మిథునం: పనుల్లో  అవరోధాలు. ఆకస్మిక ప్రయాణాలు సంభవం. ఆస్తి వివాదాలు. శ్రమ తప్ప ఫలితం ఉండదు. ఆరోగ్యభంగం. సోదరులతో కలహాలు.  వ్యాపారాలు అంతగా అనుకూలించవు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు.

కర్కాటకం: కొత్త పరిచయాలు.  శుభవార్తా శ్రవణం. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. కొన్ని సమస్యలు తీరి ఉపశమనం పొందుతారు. పనుల్లో  పురోగతి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు అనుకోని ఇంక్రిమెంట్లు.

సింహం: ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా ఉంటుంది. అనారోగ్యం. సన్నిహితులతో వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన.  వ్యాపారాలు నత్తనడకన సాగతాయి. ఉద్యోగులకు బాధ్యతలు తప్పవు.

కన్య: నూతనోత్సాహంతో పనులు  పూర్తి చేస్తారు. విలువైన వస్తువులు కొంటారు.ఆస్తి తగాదాల నుంచి బయటపడతారు. కొత్త వ్యాపారాల ప్రారంభం.ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం..

తుల: ప్రముఖులతో చర్చలు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకం. ముఖ్య నిర్ణయాలు. పనులలో విజయం.  వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు.దైవదర్శనాలు.

వృశ్చికం: ఆకస్మిక ప్రయాణాలు. ఆర్ధికంగా ఇబ్బందులు. బంధువులతో వివాదాలు. ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. ధనవ్యయం.  ఆరోగ్యభంగం.  వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు. 

ధనుస్సు: కుటుంబసభ్యులతో వివాదాలు. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. అనారోగ్యం. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. వ్యాపార విస్తరణ యత్నాలు ఫలించవు. ఉద్యోగాల్లో కొన్ని మార్పులు. 

మకరం: ప్రముఖుల నుంచి కీలక సందేశం. రుణదాతల ఒత్తిడులు తొలగుతాయి.  పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. వ్యాపారాలలో కొంతమేర లాభాలు. ఉద్యోగాల్లో మరింత ఉత్సాహం.
 
కుంభం: ఆసక్తికరమైన సమాచారం. భూసంబంధిత వివాదాలు పరిష్కారం. చాకచక్యంగా పనులు చక్కదిద్దుతారు. వ్యాపారాలలో ముందంజ. ఉద్యోగులకు ప్రమోషన్లు. విద్యార్థులకు కార్యసిద్ధి. ఆలయ దర్శనాలు.

మీనం: బంధువులతో విభేదాలు. ఆరోగ్యం మందగిస్తుంది. ఆర్థిక లావాదేవీలు∙నిరాశ కలిగించవచ్చు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు కష్టమే. ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు. ఆరోగ్యం కొంత ఇబ్బంది పెట్టవచ్చు.

Advertisement
Advertisement