ఈ రాశి వారికి ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి | Sakshi
Sakshi News home page

Daily Horoscope: ఈ రాశి వారికి ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి

Published Thu, Mar 21 2024 6:52 AM

Today Astrology: Rashi Phalalu On March 21 2024 In Telugu - Sakshi

శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, తిథి: శు.ద్వాదశి తె.5.25 వరకు (తెల్లవారితే శుక్రవారం), తదుపరి త్రయోదశి, నక్షత్రం: ఆశ్లేష రా.2.22 వరకు, తదుపరి మఖ, వర్జ్యం: ప.2.16 నుండి 4.00 వరకు, దుర్ముహూర్తం: ఉ.10.07 నుండి 10.55 వరకు, తదుపరి ప.2.57 నుండి 3.45 వరకు, అమృత ఘడియలు: రా.12.45 నుండి 2.26 వరకు; రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు, యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు, సూర్యోదయం: 6.08, సూర్యాస్తమయం: 6.06. 

మేషం: చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు. వృథా ఖర్చులు. కొత్త బాధ్యతలు. దూరప్రయాణాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు.

వృషభం: యత్నకార్యసిద్ధి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. సంఘంలో గౌరవం. ఆస్తిలాభం. దైవదర్శనాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు.

మిథునం: రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. దైవదర్శనాలు. ఆరోగ్య సమస్యలు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా ఉంటాయి.

కర్కాటకం: వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

సింహం: వ్యవహారాలలో ఆటంకాలు. దుబారా ఖర్చులు. అనుకోని ప్రయాణాలు. దైవదర్శనాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో స్వల్ప మార్పులు.

కన్య: దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ధనలాభం. కార్యసిద్ధి. పోటీపరీక్షల్లో విజయం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో చిక్కులు తొలగుతాయి.

తుల:పెండింగ్‌ పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల సలహాలు పాటిస్తారు. సంఘంలో గౌరవం. ఆస్తిలాభం. వ్యాపారాలలో పురోగతి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు.

వృశ్చికం: రుణయత్నాలు. ప్రయాణాలలో మార్పులు. ఆధ్యాత్మిక చింతన. పనులలో ఆటంకాలు. మిత్రులతో కలహాలు. వృత్తి, వ్యాపారాలలో నిరాశ.

ధనుస్సు: రాబడి కన్నా ఖర్చులు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. పనుల్లో ఆటంకాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

మకరం: వ్యవహారాలలో విజయం. ఆప్తుల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు.

కుంభం: బంధువుల తోడ్పాటు అందుతుంది. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. ఆకస్మిక ధన, వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపార, ఉద్యోగాలలో కొత్త ఆశలు.

మీనం: ఆదాయానికి మించి ఖర్చులు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. అనారోగ్య సూచనలు. బంధువులతో మాటపట్టింపులు. వృత్తి, వ్యాపారాలలో చిక్కులు.

Advertisement
Advertisement