Weekly Horoscope: ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే.. | Weekly Horoscope From 06-10-24 To 12-10-24 In Telugu | Sakshi
Sakshi News home page

Weekly Horoscope: ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..

Published Sun, Oct 6 2024 5:54 AM | Last Updated on Sun, Oct 6 2024 8:59 AM

Weekly Horoscope From 06-10-24 To 12-10-24 In Telugu

శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు ఆశ్వయుజ మాసం, తిథి: శు.చవితి పూర్తి (24 గంటలు), నక్షత్రం: విశాఖ రా.10.04 వరకు, తదుపరి అనూరాధ, వర్జ్యం: రా.2.21 నుండి 4.01 వరకు, దుర్ముహూర్తం: సా.4.11 నుండి 4.59 వరకు, అమృతఘడియలు: ప.12.23 నుండి 2.11 వరకు.

మేషం
రాబడితో సమానంగా ఖర్చులు ఎదురవుతాయి. పనులు నెమ్మదిగా పూర్తి చేస్తారు. ఆలోచనలు అమలు చేస్తారు. విద్య, ఉద్యోగావకాశాలు దక్కుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆ«ధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. తీర్థయాత్రలు చేస్తారు. ఆస్తి వివాదాలు కొంతవరకూ తీరతాయి. వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుతాయి. ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు రాగలదు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం మధ్యలో వృథా ఖర్చులు. ఆరోగ్యసమసమస్యలు, నీలం, నేరేడు రంగులు, సుబ్రహ్మణ్యేశ్వరస్తోత్రాలు పఠించండి.

వృషభం
పరపతి కలిగిన వారితో పరిచయాలు. ఆసక్తికర సమాచారం అందుతుంది. పనుల్లో విజయం సాధిస్తారు. కుటుంబసమస్యలు తీరి ఊరట లభిస్తుంది. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. భూవివాదాల నుంచి బయటపడతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కోర్టు కేసులు కొన్ని పరిష్కారమవుతాయి. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. మానసిక అశాంతి. గులాబీ, లేత పసుపు రంగులు, గణేశ్‌స్తోత్రాలు పఠించండి.

మిథునం
కుటుంబసభ్యులతో సత్సంబంధాలు. పనులు కొంత నెమ్మదిగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల సలహాలు స్వీకరించి ముందుకు సాగుతారు. ఆర్థిక వ్యవహారాలలో ఒడిదుడుకులు కాస్త తొలగుతాయి. విద్యార్థులు, నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ చూపండి. వ్యాపారాలలోలాభనష్టాలు సమానంగా ఉంటాయి. ఉద్యోగులకు పనిభారం ఉన్న గుర్తింపు రాగలదు. కళాకారులకు శుభవార్తలు. వారం ప్రారంభంలో దూరప్రయాణాలు. ధనవ్యయం నిర్ణయాలలో మార్పులు.  నీలం, ఆకుపచ్చ రంగులు, లక్ష్మీస్తోత్రాలు పఠించండి.

కర్కాటకం
ఆర్థిక పరిస్థితి కొంత వరకు అనుకూలిస్తుంది. చేపట్టిన కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. చిన్ననాటి మిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు కొత్త ఆశలు. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. వారం ప్రారంభంలో వృథా ఖర్చులు. అనారోగ్యం. పసుపు, లేత నీలం రంగులు, గణేశాష్టకం పఠించండి.

సింహం
కొత్త కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ఇంటాబయటా మీకు ఎదురుండదు. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. ఇతరుల మెప్పు పొందుతారు. కొన్ని నిర్ణయాలకు కుటుంబసభ్యుల ప్రశంసలు అందుతాయి. వస్తు, వాహన లాభాలు. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు దక్కే అవకాశం. కళాకారులకు ఉత్సాహవంతమైన కాలం.  వారం  మధ్యలో వ్యయప్రయాసలు. ఆరోగ్యసమస్యలు. ఎరుపు, తెలుపు రంగులు, శివాష్టకం పఠించండి.

కన్య
ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. ఆలోచనలు కలసిరావు. పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. బంధువులతో మాటపట్టింపులు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పట్టుదలతో ముందుకు సాగడం మంచిది. ఆరోగ్య సమస్యలు కాస్త చికాకు పరుస్తాయి. విద్యార్థుల యత్నాలు మందగిస్తాయి. వ్యాపారాలు సామాన్యంగానే ఉంటాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. రాజకీయవర్గాలకు నిరుత్సాహం. వారం మధ్యలో శుభవార్తా శ్రవణం. విందువినోదాలు. ధనలాభం. గులాబీ, లేత ఎరుపు రంగులు,  హనుమాన్‌ ఛాలీసా పఠించండి.

తుల
అనుకున్న పనులు సజావుగా పూర్తి కాగలవు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఎంతోకాలంగా ఉక్కిరిబిక్కిరి చేస్తున్న బాధ్యతల నుంచి విముక్తి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. కొత్త విషయాలు తెలుస్తాయి. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. వాహన, గృహయోగాలు. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. పారిశ్రామికవర్గాలకు ప్రభుత్వపరంగా సాయం అందుతుంది. వారం చివరిలో వివాదాలు. ధనవ్యయం. పసుపు, ఆకుపచ్చ రంగులు, విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

వృశ్చికం
ఆర్థిక ఇబ్బందులు తీరి ఊరట లభిస్తుంది. వ్యవహారాలు సాఫీగా పూర్తి కాగలవు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు. ఆరోగ్యసమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆస్తి విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు పైస్థాయి అధికారుల నుంచి ప్రశంసలు. కళాకారులకు అవార్డులు రావచ్చు. వారం ప్రారంభంలో వృథా ఖర్చులు. బంధువులతో వివాదాలు. నీలం, తెలుపు రంగులు, నవగ్రహస్తోత్రాలు పఠించండి.

ధనుస్సు
ఆశించిన రీతిలో పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. నూతన వ్యక్తుల పరిచయాలు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుంది. పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు.  తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగులకు పదోన్నతులతో కూడిన బదిలీలు. రాజకీయవర్గాలకు సన్మానాలు. వారం చివరిలో కుటుంబ, ఆరోగ్యసమస్యలు. ధనవ్యయం. ఆకుపచ్చ, నేరేడు రంగులు, కనకదుర్గాస్తోత్రాలు పఠించండి.

మకరం
ఉత్సాహంగా ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆత్మీయులు, శ్రేయోభిలాషుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. విద్యార్థుల నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. దూరమైన ఆప్తులు దగ్గరకు చేరతారు. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ప్రశంసలు అందుతాయి. కళాకారులకు సత్కారాలు. వారం చివరిలో అనారోగ్యం. శ్రమాధిక్యం. గులాబీ, తెలుపు రంగులు, దేవీస్తోత్రాలు పఠించండి.

కుంభం 
కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ. ఇంటాబయటా మీదే పైచేయిగా ఉంటుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఎటువంటి బాధ్యతనైనా సమర్థవంతంగా నిర్వహిస్తారు.  వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు రావచ్చు. పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం ప్రారంభంలో వృథా ఖర్చులు. అనారోగ్యం. ప్రయాణాలు. ఎరుపు, లేత గులాబీ రంగులు. ఆదిత్య హృదయం పఠించండి.

మీనం
ఆర్థిక వ్యవహారాలలో పురోగతి ఉంటుంది. అతి ముఖ్యమైన పనులు చకచకా సాగుతాయి. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వాహనయోగం. చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. వ్యాపారాలలో లాభాలు పొందుతారు. ఉద్యోగులకు అనుకూల మార్పులు ఉంటాయి. రాజకీయవర్గాలకు సన్మానాలు. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్యం. కుటుంబసభ్యులతో విభేదాలు. నేరేడు, నీలం రంగులు, ఆంజనేయ దండకం పఠించండి.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement