మేషం
ఇంతకాలం పడిన శ్రమకు ఫలితం దక్కవచ్చు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు. పోటీపరీçక్షల్లో అనుకూల ఫలితాలు. చిరకాల మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలలో లాభాలు దక్కుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లకు అవకాశం. రాజకీయ, కళారంగాల వారికి విదేశీ పర్యటనలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. ధనవ్యయం. ఆరోగ్యసమస్యలు. పసుపు, ఎరుపు రంగులు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.
వృషభం
పనులు సకాలంలో పూర్తయి ఊపిరిపీల్చుకుంటారు. శ్రమ ఫలించే సమయం. ఆదాయం పెరుగుతుంది. సన్నిహితులతో కొన్ని వ్యవహారాల్లో రాజీపడతారు. చర,స్థిరాస్తుల వృద్ధి. కుటుంబంలో శుభకార్యాలు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులు విధి నిర్వహణలో ఆటంకాలు అధిగమిస్తారు. రాజకీయ, కళారంగాల వారికి అనుకోని అవకాశాలు. సన్మానయోగం. వారం ప్రారంభంలో శ్రమ వృధా. బాధ్యతలు పెరుగుతాయి. మానసిక ఆందోళన. చాక్లెట్, ఆకుపచ్చ రంగులు, కనకధారాస్తోత్రాలు పఠించండి.
మిథునం
వ్యవహారాలలో అంచనాలు నిజమవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వివాహ, ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. పరిచయాలు విస్తృతమవుతాయి. మీ ఆలోచనలకు కార్యరూపం ఇస్తారు. ఇంటి నిర్మాణంలో ఎదురైన ఇబ్బందులు తొలగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. కొత్త భాగస్వాములు చేరతారు. ఉద్యోగులకు ఒక హోదా దక్కవచ్చు. పారిశ్రామిక, రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో ఇంటాబయటా ఒత్తిడులు. ఖర్చులు అధికం. గులాబీ, తెలుపు రంగులు, పంచముఖ ఆంజనేయస్వామి స్తోత్రాలు పఠించండి.
కర్కాటకం
దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. ఆశ్చర్యం కలిగించే సంఘటనలు. తండ్రితరఫు వారి నుంచి ధన, వస్తులాభాలు ఉంటాయి. శ్రేయోభిలాషుల సలహాలతో నిర్ణయాలు తీసుకుంటారు. ఇంటి నిర్మాణయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపార వృద్ధి, కొత్త పెట్టుబడులు అందుకుంటారు. ఉద్యోగాల్లో అంచనాలు నిజమవుతాయి. పారిశ్రామిక, కళారంగాల వారికి నూతనోత్సాహం. వారం మధ్యలో దూరప్రయాణాలు. ఒప్పందాలలో అవాంతరాలు. తెలుపు, చాక్లెట్‌రంగులు, నవగ్రహస్తోత్రాలు పఠించండి.
సింహం
పనులలో కొంత జాప్యం. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. దూరప్రయాణాలు. స్వల్ప అనారోగ్యం. కుటుంబసభ్యులతో వివాదాలు, మీ నిర్ణయాలను బంధువులు వ్యతిరేకిస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు సామాన్యంగా ఉండి లాభాలు నామమాత్రంగా ఉంటాయి. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు ఉండవచ్చు. రాజకీయ, పారిశ్రామికవర్గాలకు ఒత్తిడులు తప్పకపోవచ్చు. వారం మధ్యలో శుభవార్తలు వింటారు. ధనలబ్ధి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. నేరేడు, లేత ఆకుపచ్చరంగులు, హనుమాన్ ఛాలీసా పఠించండి.
కన్య
అదనపు ఆదాయం సమకూరి అవసరాలు తీరతాయి. సమస్యలు ఎదురైనా నేర్పుగా పరిష్కరించుకుంటారు. శ్రమకు ఫలితం దక్కుతుంది. ఆస్తి వ్యవహారాల్లో చికాకులు తొలగుతాయి. అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ప్రత్యర్థులు మిత్రులుగా మారి చేయూతనందిస్తారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులు ఒక సమాచారంతో ఊరట చెందుతారు. వ్యాపారాలలో పురోగతి. ఉద్యోగులకు విధి నిర్వహణలో ప్రశంసలు. రాజకీయ, కళారంగాల వారికి ఊహించని పిలుపు రావచ్చు. వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువర్గంతో తగాదాలు. ఎరుపు, బంగారురంగులు, శివపంచాక్షరి పఠించండి.
తుల
కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. విద్యార్థుల్లోని ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వస్తు, వస్త్రలాభాలు. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. కుటుంబసభ్యుల్లో అనుమానాలు నివృత్తి చేస్తారు. వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్య పరిష్కారమవుతుంది. పారిశ్రామిక, సాంకేతిక రంగాల వారికి నూతనోత్సాహం. వారం ప్రారంభంలో ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా పడతాయి. పసుపు, తెలుపురంగులు, గణేశాష్టకం పఠించండి.
వృశ్చికం
కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. ఇంటాబయటా మీదే పైచేయిగా ఉంటుంది. రావలసిన బాకీలు అంది ఖర్చులకు ఇబ్బంది ఉండదు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడవచ్చు. సంఘంలో కీర్తిప్రతిష్ఠలు దక్కుతాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు అందుతాయి. సేవాభావంతో కొన్ని కార్యక్రమాలు చేపడతారు. వ్యాపారాలలో ముందడుగు. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. రాజకీయ, కళారంగాలవారికి విదేశీ పర్యటనలు.వారం చివరిలో వ్యయప్రయాసలు. మిత్రులతో కలహాలు. అనారోగ్యం. నేరేడు, లేత ఎరుపు రంగులు, గణేశాష్టకం పఠించండి.
ధనుస్సు
ఆర్థికంగా గతం కంటే మెరుగ్గా ఉంటుంది. అనుకున్న వ్యవహారాలు పూర్తయ్యే వరకూ విశ్రమించరు. ఆలోచనలు అమలు చేసి అందర్నీ ఆకట్టుకుంటారు. కుటుంబంలో మీ పాత్ర పెరుగుతుంది. ఇంతకాలం పడిన ఇబ్బందులు, సమస్యలు తీరే సమయం. పరిచయాలు విస్తృతమవుతాయి. నిరుద్యోగుల కలలు ఫలిస్తాయి. వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో నిరాశ తొలగి అడుగు ముందుకు పడుతుంది. ఉద్యోగాలలో చిక్కులు వీడతాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు ఉంటాయి. వారం చివరిలో దూరప్రయాణాలు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. ఎరుపు, తెలుపు రంగులు. రాఘవేంద్రస్వామిని స్మరించండి.
మకరం
అనుకున్న వెంటనే పనులు చేపట్టి పూర్తి చేస్తారు. ఏదీ అసంపూర్తిగా విడిచిపెట్టరు. గతాన్ని గుర్తు చేసుకుంటూ భవిష్యత్తు ప్రణాళికలు రూపొందిస్తారు. స్థిరాస్తులు కొనుగోలుకు ఉన్న అడ్డంకులు తొలగుతాయి. ఆర్థిక పరిస్థితిని అంచనా వేసుకుని ఖర్చులు చేస్తారు. దూరపు బంధువుల ద్వారా శుభవార్తలు అందుతాయి. విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలు. ఊహించని ఒక సంఘటన ఆశ్చర్యపరుస్తుంది. వ్యాపారాలు సమృద్ధిగా లాభిస్తాయి. ఉద్యోగస్తులకు ఊరట కలుగుతుంది. బాధ్యతల భారం తగ్గవచ్చు. కళాకారులకు అవకాశాలు అప్రయత్నంగా లభిస్తాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం. అనారోగ్య సూచనలు. ప్రయాణాలలో ఆటంకాలు. గులాబీ, ఆకుపచ్చ రంగులు. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.
కుంభం
సంఘంలో మీరు చెప్పిన విషయాలు అందర్నీ మెప్పిస్తాయి. కుటుంబంలోనూ కీలకంగా మారతారు. వివాహాది ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. రుణబాధల నుండి విముక్తి లభిస్తుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వ్యక్తి ద్వారా అత్యంత కీలక విషయాలు తెలుస్తాయి. వ్యాపారాలు విస్తరణకు సమాయత్తమవుతారు. ఉద్యోగాలలో ఈతిబాధలు, సమస్యలు తీరతాయి. పారిశ్రామికవర్గాలకు ఉత్సాహం పెరుగుతుంది. వారం ప్రారంభంలో దూరప్రయాణాలు. చోరభయం. నిర్ణయాలలో మార్పులు. పసుపు, నీలం రంగులు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.
మీనం
ఎటువంటి వ్యవహారమైనా తేలిగ్గా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. ఆధ్యాత్మిక చింతన పెరిగి అధికంగా అందులో గడుపుతారు. విద్యార్థుల యత్నాలు కొలిక్కి వచ్చే వీలుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడవచ్చు. ఆర్థిక లావాదేవీలు చాకచక్యంగా నిర్వహించి అప్పులు చేయకుండా గడుపుతారు. వాహనాలు, ఇళ్ల కొనుగోలుకు వస్తున్న ఆటంకాలు అధిగమిస్తారు. సోదరుల నుండి ఆహ్వానాలు రాగలవు. వ్యాపారాలను మరింత విస్తరిస్తారు. ఉద్యోగస్తులు విధి నిర్వహణలో సమర్థతను చాటుకుంటారు. రాజకీయవర్గాలకు ఒక ఊహించని పదవి దక్కవచ్చు. గులాబీ, ఎరుపు రంగులు. వారం మ«ధ్యలో ఆరోగ్యభంగం. శ్రమా«ధిక్యం. శివాష్టకం పఠించండి.
Comments
Please login to add a commentAdd a comment