ఈ రాశి వారికి వారం మధ్యలో శుభవార్త, ఆకస్మిక ధనలాభం | Weekly Telugu Horoscope On Oct 20th To Oct 26th, 2024: Know Astrological Predictions Of Your Zodiac Signs In Telugu | Sakshi
Sakshi News home page

Weekly Horoscope In Telugu: ఈ రాశి వారికి వారం మధ్యలో శుభవార్త, ఆకస్మిక ధనలాభం

Published Sun, Oct 20 2024 6:46 AM | Last Updated on Sun, Oct 20 2024 9:55 AM

weekly horoscope 20-10-24 To 26-10-24 Telugu

మేషం..
ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. ఆలోచనలు కలసిరావు. పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. బంధువులతో మాటపట్టింపులు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటాబయటా ఒత్తిడులు ఎదుర్కొంటారు. ఆత్మవిశ్వాసం, పట్టుదలతో ముందుకు సాగడం మంచిది. ఆరోగ్య సమస్యలు కాస్త చికాకు పరుస్తాయి. విద్యార్థుల యత్నాలు మందగిస్తాయి. వ్యాపారాలు సామాన్యంగానే ఉంటాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. రాజకీయవర్గాలకు నిరుత్సాహం. వారం మధ్యలో  శుభవార్తా శ్రవణం. విందువినోదాలు. ధనలాభం. గులాబీ, లేత ఎరుపు రంగులు, హనుమాన్‌ ఛాలీసా పఠించండి.

వృషభం..
కొత్త కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ఇంటాబయటా మీకు ఎదురుండదు. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. ఇతరుల మెప్పు పొందుతారు. కొన్ని నిర్ణయాలకు కుటుంబసభ్యుల ప్రశంసలు అందుతాయి. వస్తు, వాహన లాభాలు. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు దక్కే అవకాశం. కళాకారులకు పురస్కారాలు. వారం  ప్రారంభంలో వ్యయప్రయాసలు. ప్రయాణాలు. ఆరోగ్యసమస్యలు. ఎరుపు, తెలుపు రంగులు,  శివాష్టకం పఠించండి.

మిథునం..
ఆర్థిక పరిస్థితి కొంత వరకు అనుకూలిస్తుంది. చేపట్టిన కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. చిన్ననాటి మిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు. రియల్‌ఎస్టేట్‌ వారికి లాభదాయకంగా ఉంటుంది. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు కొత్త ఆశలు. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. వారం చివరిలో వృథా ఖర్చులు. అనారోగ్యం. పసుపు, లేత నీలం రంగులు, గణేశాష్టకం పఠించండి.

కర్కాటకం..
పరపతి కలిగిన వారితో పరిచయాలు. ఆసక్తికర సమాచారం అందుతుంది. పనుల్లో విజయం సాధిస్తారు. కుటుంబసమస్యలు తీరి ఊరట లభిస్తుంది. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. భూవివాదాల నుంచి బయటపడతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కోర్టు కేసులు కొన్ని పరిష్కారమవుతాయి. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. మానసిక అశాంతి. గులాబీ, లేత పసుపు రంగులు, గణేశ్‌స్తోత్రాలు పఠించండి.

సింహం..
రాబడితో సమానంగా ఖర్చులు ఎదురవుతాయి. పనులు నెమ్మదిగా పూర్తి చేస్తారు. ఆలోచనలు అమలు చేస్తారు. విద్య, ఉద్యోగావకాశాలు దక్కుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆ«ధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. తీర్థయాత్రలు చేస్తారు. ఆస్తి వివాదాలు కొంతవరకూ తీరతాయి. వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుతాయి. ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు రాగలదు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో వృథా ఖర్చులు. ఆరోగ్యసమసమస్యలు, నీలం, నేరేడు రంగులు, సుబ్రహ్మణ్యేశ్వరస్తోత్రాలు పఠించండి.

కన్య..
కుటుంబసభ్యులతో వివాదాలు నెలకొనే అవకాశం. పనులు కొంత నెమ్మదిగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల సలహాలు స్వీకరించి ముందుకు సాగుతారు. ఆర్థిక వ్యవహారాలలో ఒడిదుడుకులు కాస్త తొలగుతాయి. విద్యార్థులు, నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ చూపండి. వ్యాపారాలలోలాభనష్టాలు సమానంగా ఉంటాయి. ఉద్యోగులకు పనిభారం ఉన్న గుర్తింపు రాగలదు. కళాకారులకు శుభవార్తలు. వారం ప్రారంభంలో మానసిక ఆందోళన. దూరప్రయాణాలు. నీలం, ఆకుపచ్చ రంగులు,  లక్ష్మీస్తోత్రాలు పఠించండి.

తుల..
అనుకున్న పనులు సజావుగా పూర్తి కాగలవు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఎంతోకాలంగా ఉక్కిరిబిక్కిరి చేస్తున్న బాధ్యతల నుంచి విముక్తి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. కొత్త విషయాలు తెలుస్తాయి. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. వాహన, గృహయోగాలు. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. పారిశ్రామికవర్గాలకు ప్రభుత్వపరంగా సాయం అందుతుంది. వారం మధ్యలో వివాదాలు. ధనవ్యయం. పసుపు, ఆకుపచ్చ రంగులు, విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

వృశ్చికం..
ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. పాతమిత్రులను కలుసుకుంటారు. ప్రముఖులు నుంచి ఆహ్వానాలు రాగలవు. ఆస్తి వివాదాలు తీరి ఊపిరిపీల్చుకుంటారు. సన్నిహితుల నుంచి సహాయం అందుతుంది. విద్యార్థుల యత్నాలు సఫలం. ఇంటి నిర్మాణయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగులకు అనుకూల మార్పులు. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం చివరిలో అనుకోని ఖర్చులు. అనారోగ్యం. ఆకుపచ్చ, నేరేడు రంగులు,  దేవీస్తోత్రాలు పఠించండి.

ధనుస్సు..
ఇంటాబయటా అనుకూల పరిస్థితి ఉంటుంది. సన్నిహితుల నుంచి అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కోర్టు వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపారాలలో పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రాగలవు. పారిశ్రామికవర్గాలకు అరుదైన ఆహ్వానాలు రాగలవు. వారం ప్రారంభంలో చికాకులు. ధనవ్యయం. అనారోగ్యం. ప్రయాణాలు. గులాబీ, లేత పసుపు రంగులు, మీనాక్షిస్తుతి మంచిది.

మకరం..
కొన్ని ఇబ్బందులు ఎదురైనా పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కొన్ని వివాదాలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. ప్రతిభకు తగిన గుర్తింపు పొందుతారు. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు కలసివస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభాలబాటలో సాగుతాయి. ఉద్యోగస్తులకు గతం నుంచి వేధిస్తున్న సమస్యలు తీరతాయి. కళాకారులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. అనుకోని ఖర్చులు. ఎరుపు, నేరేడు రంగులు,  హయగ్రీవస్తోత్రాలు పఠించండి.

కుంభం..
పరపతి పెరుగుతుంది. ప్రముఖ వ్యక్తుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలలో ఆటంకాలు తొలగుతాయి. విమర్శించిన వారే ప్రశంసిస్తారు. భూవివాదాలు కొలిక్కి వస్తాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. అనుకున్న విధంగా ఆదాయం సమకూరుతుంది. వ్యాపారాలలో అభివృద్ధి. ఉద్యోగులకు పదోన్నతులు. కళాకారులకు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వారం మధ్యలో అనారోగ్యం. వృథా ఖర్చులు. నీలం, ఆకుపచ్చ రంగులు, దత్తాత్రేయస్వామిని పూజించండి.

మీనం..
ఆర్థిక వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. ఆత్మీయుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. వివాహ, ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. కొందరు బంధువులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. విద్యార్థుల ఆశలు ఫలిస్తాయి. సమాజసేవలో పాల్గొంటారు. వాహనయోగం. వ్యాపారాలలో ఆశించిన లాభాలు తథ్యం. ఉద్యోగులకు నూతనోత్సాహం. రాజకీయవర్గాలకు పదవులు దగ్గరకు వస్తాయి. వారం మధ్యలో స్వల్ప అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. దూరప్రయాణాలు. పసుపు, నేరేడు రంగులు,  గణేశాష్టకం పఠించండి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement