మేషం
ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితులతో విభేదాలు తొలగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. ప్రత్యర్థులు అనుకూలురుగా మారతారు. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. పారిశ్రామికవర్గాలకు మరింత కలసివచ్చే కాలం.వారం మధ్యలో దూరప్రయాణాల సూచనలు. ధనవ్యయం. ఒత్తిడులు. పసుపు, తెలుపు రంగులు. శ్రీఉమాదేవి స్తోత్రాలు పఠించండి.
వృషభం
కొత్త పనులు ప్రారంభిస్తారు. సంఘంలో గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి. సోదరులు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుతుంది. వాహనాలు, ఆభరణాలు కొంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార లావాదేవీలు ఉత్సాహాన్నిస్తాయి. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుండి అనుకూల సందేశం. రాజకీయవర్గాలకు మరింత ఊరట. వారం ప్రారంభంలో వృథా ఖర్చులు. ప్రయాణాలు వాయిదా. కొత్త సమస్యలు. నీలం, నేరేడు రంగులు. . శ్రీమహాలక్ష్మీ పంచరత్నావళి పఠించండి.
మిథునం
కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. పరపతి పెరుగుతుంది. ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. వాహనాలు, భూములు కొంటారు. విద్యార్థుల కృషి ఫలిస్తుంది. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాల విస్తరణలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు మరింత వెసులుబాటు కలుగుతుంది. కళారంగం వారి యత్నాలు కొలిక్కి వస్తాయి. వీరికి తగిన గుర్తింపు రాగలదు. వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువర్గంతో అకారణ వైరం. ఎరుపు, ఆకుపచ్చరంగులు, ఆదిత్య హృదయంపఠించండి.
కర్కాటకం
కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆత్మీయులు, శ్రేయోభిలాషుల సలహాలు పొందుతారు. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలకు హాజరవుతారు. మిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. వాహనయోగం. కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు సంతోషకరమైన వార్తలు అందుతాయి. పారిశ్రామికవేత్తల కృషి, పట్టుదల నెరవేరతాయి. వారం చివరిలో ఆరోగ్య సమస్యలు. కష్టపడ్డా ఫలితం నామమాత్రం. ఆకుపచ్చ, తెలుపు రంగులు, విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.
సింహం
పనులు కొంత నెమ్మదిగా సాగుతాయి. బంధువులు, మిత్రులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. నిరుద్యోగుల కల ఫలిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం పొందుతారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు అదనపు బాధ్యతల నుండి విముక్తి. రాజకీయవర్గాలకు కార్యసిద్ధి. తెలుపు, వారం ప్రారంభంలో ఆకస్మిక ప్రయాణాలు. ధనవ్యయం. కుటుంబంలో సమస్యలు. చాక్లెట్ రంగులు, శ్రీమీనాక్షిస్తుతి పఠించండి.
కన్య
ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. ఆసక్తికరమైన సమాచారం అందుతుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆలయ దర్శనాలు. ఇంటాబయటా అనుకూలం. ఇంటర్వ్యూలు అందుతాయి. సోదరులు, సోదరీలతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. కళారంగం వారికి శుభవర్తమానాలు, సన్మానాలు. వారం మధ్యలో మానసిక అశాంతి. కుటుంబసభ్యులతో తగాదాలు. ఆకుపచ్చ, తెలుపురంగులు, శ్రీశివాష్టకం పఠించండి.
తుల
ముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. మీ అంచనాలు నిజమవుతాయి. ఆత్మీయుల సలహాలు స్వీకరిస్తారు. ఆస్తి వివాదాల పరిష్కారం. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు. ఉద్యోగులు విధుల్లో ఆటంకాలు అధిగమిస్తారు. పారిశ్రామికవర్గాలకు కొన్ని సమస్యలు తీరతాయి. వారం చివరిలో దూరప్రయాణాలు. స్నేహితులతో మాటపట్టింపులు. తెలుపు, చాక్లెట్æరంగులు, శ్రీదత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.
వృశ్చికం
అనుకున్న పనులు సజావుగా సాగుతాయి. మీపై వచ్చిన అభియోగాల నుంచి బయటపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. పరపతి పెరుగుతుంది. గృహ, వాహనయోగాలు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. పోటీపరీక్షల్లో విజయం. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగుల శ్రమ ఫలిస్తుంది. రాజకీయవర్గాలకు కొన్ని కేసుల నుండి ఉపశమనం.
వారం ప్రారంభంలో బంధువుల నుండి ఒత్తిడులు. ఖర్చులు పెరుగుతాయి. ఎరుపు, తెలుపు రంగులు.శ్రీసుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.
ధనుస్సు
కొన్ని కార్యక్రమాలు నిదానంగా సాగుతాయి. బంధువులు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. మీలోని నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. ఒక ప్రకటన నిరుద్యోగులు, విద్యార్థులను ఆకట్టుకుంటుంది. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపార విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగులు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తించి పేరుగడిస్తారు. కళారంగం వారికి యోగదాయకమైన కాలం. వారం ప్రారంభంలో మిత్రులతో విభేదాలు. ఆరోగ్యం సహకరించకపోవచ్చు. గులాబీ, పసుపు రంగులు, శివపంచాక్షరి పఠించండి.
మకరం
పనుల్లో పురోగతి కనిపిస్తుంది. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. గత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం మధ్యలో దూరప్రయాణాలు. ఇంటాబయటా సమస్యలు. ఎరుపు, చాక్లెట్ రంగులు,దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.
కుంభం
ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. కుటుంబ, ఆరోగ్య సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. బంధువులతో మాటపట్టింపులు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. కొన్ని పనులు మధ్యలో విరమిస్తారు. విద్యార్థుల యత్నాలు మందగిస్తాయి. ప్రత్యర్థుల నుంచి ఒత్తిడులు. వ్యాపారాలలో లాభాలు అంతగా ఉండవు. ఉద్యోగులకు శ్రమాధిక్యం. కళారంగం వారికి విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. వారం మధ్యలో శుభవర్తమానాలు. ధనలాభం. ఉద్యోగయత్నాలు సఫలం. నీలం, తెలుపు రంగులు, శ్రీరామరక్షాస్తోత్రాలు పఠించండి.
మీనం
ఆర్థిక పరిస్థితి మొదట్లోకొంత నిరాశ కలిగించినా అవసరాలకు డబ్బు అందుతుంది. పనులు నెమ్మదిగా సాగుతాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆప్తుల నుంచి ఆహ్వానాలు రాగలవు. భూవివాదాలు తీరతాయి. ఆరోగ్యభంగం. వాహనసౌఖ్యం. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. వ్యాపారాలు అనుకున్న మేరకు లాభిస్తాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు. రాజకీయవర్గాలకు మరింత ఆదరణ లభిస్తుంది. వారం చివరిలో మీ శ్రమ వృథా కాగలదు. ఆస్తుల వివాదాలు. ధనవ్యయం. ఆకుపచ్చరంగు,లేత గులాబీరంగు,దుర్గాస్తోత్రాలు పఠిస్తే మంచిది.
Comments
Please login to add a commentAdd a comment