Weekly Horoscope 02-10-2022 To 08-10-2022 In Telugu| Vara Phalalu - Sakshi
Sakshi News home page

వారఫలాలు: 2 అక్టోబర్‌ నుంచి 8 అక్టోబర్‌ 2022 వరకు

Published Sun, Oct 2 2022 6:44 AM | Last Updated on Sun, Oct 2 2022 12:24 PM

Weekly Horoscope Telugu 02-10-2022 To 08-10-2022 - Sakshi

మేషం 
(అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
కొత్త ఆలోచనలతో ముందడుగు వేస్తారు. ఆస్తి తగాదాలు తీరి లాభం పొందుతారు. దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం రాగలదు. వాహన, కుటుంబసౌఖ్యం. విద్యార్థులు సత్తా చాటుకుని ముందుకు సాగుతారు. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో మీ ఊహలు నిజం కాగల అవకాశం. కళారంగం వారికి సన్మానయోగం. వారం ప్రారంభంలో  అనుకోని ఖర్చులు. ఆరోగ్యసమస్యలు. ఎరుపు, ఆకుపచ్చ. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

వృషభం
(కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా.)
మొదట్లో కొన్ని ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు. రియల్టర్లు అనుకున్నది సాధిస్తారు. అదనపు రాబడి ఉంటుంది. మీ అంచనాలు, ఊహలు నిజం కాగలవు. ప్రత్యర్థులు విధేయులుగా మారతారు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులతో లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో సంతోషకరమైన సమాచారం అందుతుంది. పారిశ్రామికవర్గాలకు ఆహ్వానాలు రాగలవు. వారం ప్రారంభంలో  బంధువిరోధాలు. అనారోగ్యం. శ్రమాధిక్యం. గులాబీ, పసుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి.

మిథునం
(మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
రాబడి సంతృప్తికరంగా ఉంటుంది.  కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. యత్నకార్యసిద్ధి. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. కీలక సమావేశాలలో పాల్గొంటారు. వాహనాలు, స్థలాలు కొంటారు.  ఆస్తి వివాదాలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో కీలక మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు శ్రమానంతరం ఫలితం దక్కుతుంది. వారం మధ్యలో  అనుకోని ఖర్చులు. ఆకుపచ్చ, తెలుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఈశ్వరారాధన మంచిది.

కర్కాటకం
(పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
భూములు, వాహనాల కొనుగోలు. కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి. ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. నిరుద్యోగుల కలలు ఫలిస్తాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తాయి. కళారంగం వారికి ఊహించని అవకాశాలు. వారం చివరిలో కుటుంబంలో ఒత్తిడులు.  ఎరుపు, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌ చాలీసా పఠనం ఉత్తమం.

సింహం
(మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది.   ప్రముఖులతో చర్చలు సఫలం. ఆస్తులు ఎట్టకేలకు కొనుగోలు చేస్తారు. ఇంటి నిర్మాణాలపై దృష్టి సారిస్తారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగాలలో మీరు ఆశించిన మార్పులు ఉండవచ్చు. కళారంగం వారి ఆశలు కొన్ని ఫలించే అవకాశం. వారం చివరిలో మానసిక ఆందోళన. ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం వద్దు. గులాబీ, పసుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. కాలభైరవాష్టకం పఠించండి.

కన్య
(ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
రాబడి మరింత ఉత్సాహాన్నిస్తుంది. పరపతి కలిగిన వారితో పరిచయాలు. విద్యార్థులు కొత్త విద్యావకాశాలు దక్కించుకుంటారు. భూములు, స్థలాల కొనుగోలు. బంధువుల నుంచి ఆహ్వానాలు. నిరుద్యోగుల  చిరకాల స్వప్నం నెరవేరుతుంది. వ్యాపారాలలో పెట్టుబడులు మరింతగా సమకూరతాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు అధిగమిస్తారు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. ఆకుపచ్చ, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి.

తుల
(చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. విలువైన సమాచారం అంది సంతోషంగా గడుపుతారు. ఆదాయం ఆశాజనకంగా ఉండి అవసరాలు తీరతాయి. ఇతరుల నుంచి బాకీలు కూడా అందుతాయి. మీ ఆలోచనలను క్రమేపీ అమలు  చేస్తారు. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు. రాజకీయవర్గాలకు నూతనోత్సాహం. వారం మధ్యలో  అనారోగ్యం. నీలం, ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

వృశ్చికం
(విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఆదాయానికి మించి ఖర్చులు ఎదురై ఇబ్బందిపడతారు. బంధువులను కలిసి ముఖ్య విషయాలు చర్చిస్తారు. నూతన విద్యావకాశాల కోసం శ్రమిస్తారు. స్థిరాస్తి వివాదాలు నెలకొంటాయి. వ్యాపారాలలో కొంత నిదానం అవసరం. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు. పారిశ్రామికవర్గాలు  అగ్రిమెంట్లు కొన్ని రద్దు చేసుకుంటారు. వారం మధ్యలో శుభవర్తమానాలు. ఎరుపు, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శివస్తోత్రాలు పఠించండి.

ధనుస్సు
(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ఆస్తి విషయంలో కొన్ని చిక్కులు వీడతాయి. పనుల్లో విజయం. నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. శత్రువులు మిత్రులుగా మారతారు. తీర్థయాత్రలు చేస్తారు. వాహన, గృహయోగాలు. వ్యాపారాలలో పెట్టుబడులు అందుకుంటారు. ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు ఊహించని సన్మానాలు, విదేశీ పర్యటనలు. వారం చివరిలో వృథా ఖర్చులు. ఆప్తులతో విభేదాలు. పసుపు, ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి.

మకరం
(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
అనుకున్న రాబడి పొందుతారు. విద్యార్థులు మరింత ఉత్సాహంగా అవకాశాలు సాధిస్తారు. కొత్త కాంట్రాక్టులను దక్కించుకుంటారు. వాహనాలు, భూములు సమకూర్చుకుంటారు. వ్యాపారాలలో అనుకున్న లాభాలతో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో  విధి నిర్వహణ సమర్థవంతంగా నిర్వహిస్తారు. కళారంగం వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది.  వారం ప్రారంభంలో అనారోగ్య సూచనలు. నేరేడు, పసుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి.

కుంభం
(ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
అదనపు ఆదాయం సమకూరి ఉత్సాహంగా గడుపుతారు. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. ఇంటి నిర్మాణయత్నాలను వేగవంతం చేస్తారు.  కాంట్రాక్టర్లకు అగ్రిమెంట్లు కుదురుతాయి.  వ్యాపారాలలో లక్ష్యాలు సాధిస్తారు. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం నెలకొంటుంది. పారిశ్రామికవేత్తలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. ఆకుపచ్చ, నీలం రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి..

మీనం
(పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
కొత్త పనులు సమయానికి పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణబాధలు తీరతాయి. బంధువుల సలహాలతో కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగ, విద్యావకాశాలు సంతృప్తినిస్తాయి. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో  కళారంగం వారికి అవార్డులు రావచ్చు. వారం మనశ్శాంతి లోపిస్తుంది. అనారోగ్యం. నేరేడు, పసుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామస్తోత్రాలు పఠించండి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement