
మేషం..
కొత్త కార్యక్రమాలు చేపడతారు. అందరిలోనూ గుర్తింపు లభిస్తుంది. ఓర్పుతో కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. దూరపు బంధువుల సలహాలు పాటించి ముందడుగు వేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారాలలో నూతనోత్సాహం. ఉద్యోగులకు పదోన్నతులు. రాజకీయవేత్తలకు విదేశీ పర్యటనలు ఉంటాయి. వారం ప్రారంభంలో దూరప్రయాణాలు. ఒప్పందాలలో ఆటంకాలు. ఆకుపచ్చ, గులాబీ రంగులు, విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.
వృషభం..
పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. విద్యార్థులకు కొత్త విద్యావకాశాలు. ప్రముఖులతో పరిచయాలు. వాహన, కుటుంబసౌఖ్యం. మీ అంచనాలు నిజమవుతాయి. రాబడి పెరుగుతుంది. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలలో అడుగు ముందుకు వేస్తారు. ఉద్యోగులకు ఉన్నతస్థితి. కళాకారులకు కాస్త ఉపశమనం లభిస్తుంది. వారం మధ్యలో ఆరోగ్యభంగం. శ్రమ మరింత పెరుగుతుంది. గులాబీ,తెలుపు రంగులు, ఆంజనేయ దండకం పఠించండి.
మిథునం..
ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు, స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. మీ సేవలకు తగిన గుర్తింపు లభిస్తుంది. పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన సమాచారం. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలం. వ్యాపారాలు అభివృద్ధిపథంలో సాగుతాయి. ఉద్యోగులకు సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి. రాజకీయవర్గాలకు సన్మానాలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. కుటుంబంలో వివాదాలు. నీలం, నలుపు రంగులు, గణపతిని పూజించండి.
కర్కాటకం..
కొత్త విషయాలు గ్రహిస్తారు. సంఘంలో పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆదాయం సంతృప్తినిస్తుంది. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. ఆలయాలు సందర్శిస్తారు.ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. శుభకార్యాల రీత్యా ఖర్చులు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఆశలు చిగురిస్తాయి. కళాకారుల యత్నాలు సఫలం. వారం ప్రారంభంలో ఆకస్మిక ప్రయాణాలు. సోదరులతో కలహాలు. లేత నీలం, నేరేడు రంగులు, లక్ష్మీదేవి స్తోత్రాలు పఠించండి.
సింహం..
పనుల్లో ముందడుగు వేస్తారు. ఆదాయం మరింత పెరిగే అవకాశం. కొత్త విద్యావకాశాలు పొందుతారు. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. ప్రయాణాల్లో నూతన పరిచయాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు అభివృద్ధిదాయకంగా ఉంటాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు. రాజకీయవేత్తలకు పదవీయోగాలు. వారం ప్రారంభంలో దూరప్రయాణాలు. మానసిక ఆందోళన. చర్చలు విఫలం. పసుపు, లేత ఎరుపు రంగులు, దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.
కన్య..
చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి. అందరికీ ఆదర్శవంతంగా నిలుస్తారు. ఇంటర్వ్యూలు అందుకుంటారు. మీ కృషి ఫలించే సమయం. జీవిత భాగస్వామితో తగాదాలు తీరతాయి. కాంట్రాక్టర్లకు అనుకూల సమయం. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు మంచి గుర్తింపు. కళాకారులకు ఊహించని అవకాశాలు. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబసభ్యుల నుండి సమస్యలు. ఎరుపు, చాక్లెట్ రంగులు, శివపంచాక్షరి పఠించండి..
తుల..
చేపట్టిన పనులలో కొంత జాప్యం. రాబడికి మించి ఖర్చులు ఉంటాయి. కుటుంబసభ్యులతో కొన్ని విషయాలలో విభేదిస్తారు. ఆరోగ్యసమస్యలు కొంత చికాకు పరుస్తాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు సాదాసీదాగా సాగుతాయి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. రాజకీయనేతలకు కొంత నిరాశ తప్పదు. వారం మధ్యలో శుభవర్తమానాలు. ధనలబ్ది. విందువినోదాలు. పసుపు, లేతనీలం రంగులు, రాఘవేంద్రస్వామి స్తోత్రాలు పఠించండి.
వృశ్చికం..
కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆరోగ్యసమస్యల నుంచి బయటపడతారు. ఆదాయం మరింత పెరుగుతుంది. మిత్రుల నుంచి శుభవార్తలు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. నిర్ణయాలలో మాత్రం కొంత నిదానం అవసరం. దేవాలయాలు సందర్శిస్తారు. సోదరులతో సఖ్యత ఏర్పడుతుంది. వ్యాపారాలలో లాభాలు తథ్యం. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. పారిశ్రామికవర్గాలకు కొత్త ఆశలు. వారం మధ్యలో ఆరోగ్య సమస్యలు. స్నేహితుల నుండి ఒత్తిడులు పెరుగుతాయి. గులాబీ, లేత ఎరుపు రంగులు, దుర్గాస్తోత్రాలు పఠించండి.
ధనుస్సు..
అదనపు ఆదాయం సమకూరుతుంది. సన్నిహితులతో వివాదాలు తీరతాయి. మీ అంచనలు నిజమవుతాయి. నిరుద్యోగులను ఒక ప్రకటన ఆకట్టుకుంటుంది. తీర్థయాత్రలు చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. ఉద్యోగులకు చిక్కులు తొలగుతాయి. రాజకీయవేత్తలకు కొత్త పదవులు దక్కే అవకాశం. వారం ప్రారంభంలో అనుకోని ప్రయాణాలు. మనశ్శాంతి లోపిస్తుంది. నీలం, తెలుపు రంగులు, దత్తాత్రేయస్తోత్రాలు పఠించండి.
మకరం..
కొన్ని వ్యవహారాలు సకాలంలో పూర్తి. ఇంటిలో శుభకార్యాల నిర్వహణ. విలువైన వస్తువులు కొంటారు. స్థిరాస్తి వివాదాలు తీరతాయి. అనుకున్నది పట్టుదలతో సాధిస్తారు. వేడుకల్లో చురుగ్గా పాల్గొంటారు. వ్యాపారాలు ఉత్సాహాన్నిస్తాయి. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు దక్కవచ్చు. రాజకీయవేత్తలకు విదేశీ పర్యటనలు. వారం చివరిలో ప్రయాణాలు వాయిదా. శ్రమ తప్పదు. ఆరోగ్య సమస్యలు. తెలుపు,బంగారు రంగులు, గణేశ్‌స్తోత్రాలు పఠించండి.
కుంభం..
పనులు చకచకా పూర్తి చేస్తారు. ఆదాయం పెరిగి అవసరాలు తీరతాయి. మీ వ్యూహాల అమలులో కుటుంబసభ్యుల సహకారం అందుతుంది. నిరుద్యోగులకు అంచనాలు నిజమవుతాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయమవుతారు. వాహనాలు, స్థలాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి. కళాకారులకు సన్మానాలు. వారం మధ్యలో ధననష్టం. సోదరుల నుండి కొన్ని వివాదాలు. ఎరుపు, నేరేడు రంగులు, ఆదిత్య హృదయం పఠించండి.
మీనం..
కొన్ని కార్యక్రమాలను సమయానికి పూర్తి చేస్తారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. రుణబాధలు కాస్త తీరతాయి. భవిష్యత్‌పై నిరుద్యోగులకు కొత్త ఆశలు. స్నేహితుల నుంచి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. ఆరోగ్య సమస్యలు కొంత వేధిస్తాయి. వ్యాపారాలలో ఒత్తిడులు అధిగమిస్తారు. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు. కళాకారులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వారం ప్రారంభంలో అనారోగ్య సూచనలు. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. గులాబీ, లేత పసుపు రంగులు, శ్రీరామస్తోత్రాలు పఠించండి.
Comments
Please login to add a commentAdd a comment