మేషం: చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. భూవివాదాలు తీరతాయి. ఇంటాబయటా అనుకూల పరిస్థితి. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఒక సమాచారం నిరుద్యోగులను ఆకట్టుకుంటుంది. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుతాయి. ఉద్యోగులకు పరిస్థితులు అనుకూలిస్తాయి. కళాకారులకు మరిన్ని అవకాశాలు రావచ్చు. వారం చివరిలో వివాదాలు. అనారోగ్యం. దూరప్రయాణాలు. ఎరుపు, పసుపు రంగులు, విష్ణుధ్యానం చేయండి.
వృషభం: కొత్త పనులు ప్రారంభిస్తారు. సంఘంలో ఎనలేని గౌరవం. చిన్ననాటి మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. అరుదైన ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగులకు సంతోషకరమైన సమాచారం. ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలలో లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగి ఊరట చెందుతారు. పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం చివరిలో దూరప్రయాణాలు. ఆరోగ్యభంగం. బంధువులతో మాటపట్టింపులు. గులాబీ, నేరేడు రంగులు. దుర్గాదేవిని స్మరించండి.
మిథునం: కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి శుభవార్తలు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. ఒక ప్రకటన నిరుద్యోగులను ఆకట్టుకుంటుంది. కొన్ని వివాదాలు తీరతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో నూతనోత్సాహం, అనుకున్న లాభాలు తథ్యం. ఉద్యోగులకు కొత్త హోదాలు. రాజకీయవర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. వారం ప్రారంభంలో ప్రయాణాలు. రుణాలు చేస్తారు. బాధ్యతలు పెరుగుతాయి. ఆకుపచ్చ, నీలం రంగులు. నృసింహస్తోత్రాలు పఠించండి.
కర్కాటకం: పనుల్లో విజయం సాధిస్తారు. మిత్రులు, బంధువులతో వివాదాలు పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. రావలసిన సొమ్ము అందుతుంది. నిరుద్యోగులు పోటీ పరీక్షల్లో అనుకూల ఫలితాలు సాధిస్తారు. చిరకాల కోరిక నెరవేరే సమయం. ఇంటి నిర్మాణయత్నాలు సాగిస్తారు. వ్యాపారాలలో పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగులకు పైస్థాయి నుంచి ప్రశంసలు. కళాకారులకు మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం ప్రారంభంలో ఆస్తి వివాదాలు.ప్రయాణాలలో ఆటంకాలు. సన్నిహితులతో తగాదాలు. నీలం, పసుపు రంగులు. శ్రీరామస్తోత్రాలు పఠించండి.
సింహం: చేపట్టిన పనులు సజావుగా పూర్తి చేస్తారు. మిత్రుల నుండి కీలక సలహాలు తీసుకుంటారు. సమాజంలో పరపతి పెరుగుతుంది. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. ఇంతకాలం పడిన శ్రమకు ఫలితం దక్కుతుంది. వాహనసౌఖ్యం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటిలో శుభకార్యాలు. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు ఉన్నత హోదాలు. రాజకీయవర్గాలకు పదవులు దక్కుతాయి. వారం మధ్యలో వ్యయప్రయాసలు. వృథా ఖర్చులు. కుటుంబసమస్యలు. ఎరుపు, ఆకుపచ్చ రంగులు, విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.
కన్య: దూరపు బంధువులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. ఆస్తి విషయాలలో ఒప్పందాలు చేసుకుంటారు. నిరుద్యోగులు, విద్యార్థులకు అనుకూల ఫలితాలు. గృహ నిర్మాణయత్నాలు ఫలిస్తాయి. ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. వాహనాలు, భూములు కొంటారు. వ్యాపారాలను మీ అంచనాలకు తగినంతగా విస్తరిస్తారు. ఉద్యోగులకు కొత్త హోదాలు రాగలవు. కళాకారులకు ఆహ్వానాలు అందుతాయి. వారం మధ్యలో చివరిలో దూరప్రయాణాలు. మానసిక అశాంతి. కుటుంబసభ్యుల నుండి ఒత్తిడులు. గులాబీ, తెలుపు రంగులు, అన్నపూర్ణాష్టకం పఠించండి.
తుల: అనుకున్న పనుల్లో పురోగతి ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు తీరతాయి. ప్రముఖులతో పరిచయాలు. ప్రత్యర్థులు సైతం సహాయపడతారు. వాహనయోగం. కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. విద్యార్థుల ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆలోచనలు అమలు చేస్తారు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుతాయి. ఉద్యోగులకు అనుకూల మార్పులు ఉంటాయి. కళాకారులకు సన్మానాలు. వారం ప్రారంభంలో ధనవ్యయం. దూరప్రయాణాలు. సోదరులతో వివాదాలు. పసుపు, గులాబీ రంగులు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.
వృశ్చికం: నూతనోత్సాహంతో వ్యవహారాలు పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులతో కష్టసుఖాలు పంచుకుంటారు. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. బంధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు. రాజకీయవర్గాలకు ఆహ్వానాలు అందే అవకాశం. వారం ప్రారంభంలో మిత్రులతో వివాదాలు. అనారోగ్యం. మానసిక ఆందోళన. ఎరుపు, నీలం రంగులు, ఆంజనేయ దండకం పఠించండి.
ధనుస్సు: దూరపు బంధువుల నుంచి శుభవార్తలు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. రుణబాధలు తొలగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. విద్యార్థుల యత్నాలు కలసివస్తాయి. మీ ఊహలు నిజం చేసుకుంటారు. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. పారిశ్రామికవర్గాల ఆశలు నెరవేరతాయి. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. స్వల్ప అనారోగ్యం. ఎరుపు, తెలుపు రంగులు, దేవీఖడ్గమాల పఠించండి.
మకరం: ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత మందగిస్తుంది. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆలోచనలు కలసిరావు. ఆరోగ్యభంగం. విద్యార్థులకు ఒత్తిడులు పెరుగుతాయి. బంధువులతో వివాదాలు. శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు ఊహింటని మార్పులు ఉంటాయి. రాజకీయవర్గాలకు కొంత నిరాశ తప్పదు. వారం మధ్యలో శుభవార్తలు. ఆకస్మిక ధన,వస్తులాభాలు. పసుపు, ఆకుపచ్చ రంగులు, నవగ్రహస్తోత్రాలు పఠించండి.
కుంభం: ఆర్థికంగా కొంత బలపడతారు. ఆలోచనలు వెనువెంటనే అమలు చేస్తారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. మీ శక్తిసామర్థ్యాలు వెలుగులోకి వస్తాయి. చిరకాల శత్రువులు కూడా అనుకూలురుగా మారవచ్చు. పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. అనుకున్న వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. పరిచయాలు మరింత పెంచుకుంటారు. వ్యాపారాలు లాభాలబాటలో సాగుతాయి. ఉద్యోగాలలో వివాదాలు సర్దుకుంటాయి. కళాకారుల యత్నాలలో కొంత ప్రగతి కనిపిస్తుంది. వారం చివరిలో బంధువులతో స్వల్ప వివాదాలు. దూరప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా. గులాబీ, నీలం రంగులు, కనకధారా స్తోత్రాలు పఠించండి.
మీనం: వ్యవహారాలను చాకచక్యంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులు మరింత దగ్గరవుతారు. ఆస్తుల విషయంలో సమస్యలు తీరే అవకాశాలున్నాయి. ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకుని ఊరట చెందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. కుటుంబనిర్ణయాలలో కీలక పాత్ర పోషిస్తారు. సోదరులతో విభేదాలు తీరతాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలను క్రమంగా వృద్ధి చేసుకుంటారు. ఉద్యోగాలలో ఒత్తిడుల నుండి గట్టెక్కుతారు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు ఉండవచ్చు. వారం ప్రారంభంలో ఖర్చులు పెరుగుతాయి. మానసిక అశాంతి. శ్రమకు తగిన ఫలితం కనిపించదు. పసుపు, ఆకుపచ్చ రంగులు. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.
Comments
Please login to add a commentAdd a comment